మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకున్నాడు బెల్లంకొండ గణేష్. అదే జోష్ తో ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. రాకీ ఉప్పలపాటీ దర్శకత్వంలో బెల్లంకొండ గణేష్ హీరోగా వస్తున్న సినిమా నేను స్టూడెంట్ సార్. ఇక ఒకపక్క షూటింగ్ ను జరుపుతూనే మరోపక్క ఈసినిమాలో నటిస్తున్న నటీనటులకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేస్తూ వస్తున్నారు. దీనిలో భాగంగానే రీసెంట్ గానే ఈసినిమాలో నటించే హీరోయిన్ కు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈసినిమాలో హీరోయిన్ గా అవంతిక దాసానిని ఫిక్స్ చేశారు. ఈసినిమాలో ఆమె ‘శృతి వాసుదేవన్’ గా నటించనుంది. ఇక ఇప్పుడు ఈసినిమాలో నటించే మరో కీలకనటుడికి సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమాలో విలక్షణ నటుడు సముద్రఖని ఒక కీలక పాత్రలో నటించనున్నారు. దీనిలో భాగంగానే ఈయన పాత్రకు సంబంథించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈసినిమాలో సముద్రఖని అర్జున్ వాసుదేవన్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో సునీల్ కూడా కీలక పాత్రలో పోషిస్తున్నారు.. ఈసినిమాను నాంది వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని రూపొందించిన ఎస్‌వీ2 ఎంటర్టైనమెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ గా అనిత్ మధాడి.. చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: