పివిపి సినిమాస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ పై అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో విశ్వక్ సేన్ , మిథిలా పాల్కర్ జంటగా తమిళ సూపర్ హిట్ ఓ మై కడవులే మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఓరి దేవుడా..! మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ కానుంది. ఇద్దరు ప్రేమికులు పెళ్లి తరువాత మనస్పర్థల కారణంగా వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ లో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. ఓరి దేవుడా . ! చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ,సాంగ్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సూపర్ హిట్ అశోక వనంలో అర్జున కళ్యాణం మూవీ తో ప్రేక్షకులను అలరించిన యువ కథానాయకుడు విశ్వక్ సేన్ ఓరి దేవుడా . ! మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఓరి దేవుడా .. ! మూవీ 21 వ తేదీ రిలీజ్ కావడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను భారీ ఎత్తున చేపట్టారు. రీసెంట్ గా రాజమండ్రి లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథి గా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఓరి దేవుడా .. ! మూవీ ని హీరో విశ్వక్ సేన్ సోషల్ మీడియా ద్వారా , పలు ఇంటర్వూస్ తో హైప్ క్రియేట్ చేస్తున్నారు.
ఓరి దేవుడా .. ! మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: