టాలీవుడ్ యాంగ్రీ హీరో రాజశేఖర్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘గరుడ వేగ’ మూవీతో ఫామ్ లోకి వచ్చిన తర్వాత కల్కి , శేఖర్ వంటి మూవీ లతో అలరించాడు రాజశేఖర్. ఇప్పుడు మరో యాక్షన్ ఎంటర్ టైనర్ తో రాబోతున్నాడు. రాజశేఖర్ హీరోగా, పవన్ సాదినేని దర్శకత్వంలో ఈసినిమా రాబోతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుతుంది. ఈసినిమా టైటిల్ ను ఇటీవలే ఫిక్స్ చేసి ప్రకటించారు. ‘మాన్ స్టర్’ అనే టైటిల్ ని ఈసినిమాకు ఖరారు చేశారు. ఈసినిమాలో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమాలో మరో యంగ్ హీరోను కూడా తీసుకోనున్నట్టు తెలుస్తుంది. ఈ యంగ్ హీరో ఎవరో కాదు రాజ్ తరుణ్. ఈసినిమాలో ఒక కీలక పాత్ర కోసం రాజ్ తరుణ్ ను తీసుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ ఆగాల్సిందే.
కాగా సురక్ష ఎంటర్ టైన్ మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివ కుమార్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఎమ్ జిబ్రాన్ సంగీతం అందించగా, వివేక్ కాలేపు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. విప్లవ్ నైషధం ఎడిటర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి రాకేందు మౌళి డైలాగ్స్ అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: