నేను స్టూడెంట్ సార్ హీరోయిన్ ఫిక్స్

Heroine Fixed for Nenu Student Sir Movie, Nenu Student Sir Movie Heroine, Bhagyashree’s Daughter Avantika, Avantika As Heroine for Nenu Student Sir Movie, Bhagyashree’s Daughter, Bellamkonda Ganesh, Avantika Dasani, Rakhi Uppalapati, Nenu Student Sir, Nenu Student Sir Telugu movie, Nenu Student Sir New Update, Nenu Student Sir Telugu Movie New Update, Nenu Student Sir Movie, Nenu Student Sir Latest Update, Nenu Student Sir Movie Updates, Nenu Student Sir Telugu Movie Live Updates, Nenu Student Sir Telugu Movie Latest News, Nenu Student Sir Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ గణేష్ స్వాతిముత్యం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకున్నాడు బెల్లంకొండ గణేష్. మంచి కామెడీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చి తన డీసెంట్ యాక్టింగ్ తో మంచి మార్కులే కొట్టేశాడు గణేష్. ఇక మొదటి సినిమా రిలీజ్ కాకముందే రెండో సినిమాకు లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే కదా. రాకీ ఉప్ప‌ల‌పాటీ ద‌ర్శ‌క‌త్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈసినిమా టైటిల్ ను అలానే ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి నేను స్టూడెంట్ సార్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా హీరోయిన్ ను ఫిక్స్ చేశారు. ఈసినిమాలో హీరోయిన్ గా అవంతిక దాసానిని ఫిక్స్ చేశారు. ఈసినిమాలో ఆమె ‘శృతి వాసుదేవన్’ గా నటించనుంది. అవంతిక దాసాని అలనాటి నటి భాగ్యశ్రీ కూతురు. నేను స్టూడెంట్ సార్ సినిమాతో ఆమె తెలుగులోకి అరంగేట్రం చేస్తోంది. రిలీజ్ చేసిన పోస్టర్ లో స్టైలిష్ అండ్ క్యూట్‌గా కనిపిస్తున్న అవంతిక ఈ సినిమాలో కాలేజీ స్టూడెంట్‌గా కనిపిస్తుంది.

కాగా ఈసినిమాలో సముద్రఖని, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈసినిమాను నాంది వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాన్ని రూపొందించిన ఎస్‌వీ2 ఎంట‌ర్టైన‌మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ గా అనిత్ మధాడి.. చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − five =