నమ్రత శిరోద్కర్ హార్ట్ ఫుల్ మెసేజ్

Namrata Shirodkar Shares A Lovely Family Click with Superstar Krishna, Namrata shared a family photo with Mahesh Babu, Superstar Krishna, Namrata Shirodkar Shares A Lovely Family Click, Namrata shares a heartfelt message for Ghattamaneni family, Superstar Krishna Family Click, Ghattamaneni Indira Devi, Indira Devi, Indira Devi Health Issues, Indira Devi Latest News, Indira Devi Passes Away, Tollywood superstar Mahesh Babu, mahesh babu, Mahesh Babu Mother, Mahesh Babu Mother Indira Devi, Mahesh Babu Mother Latest Updates, Mahesh Babu Mother Latest News, Mahesh Babu’s Mother, Super Star Mahesh Babu, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాదు ఒకపక్క ఇంట్లో వ్యవహారాలు చూస్తూనే మరోపక్క మహేష్ కు సంబంధించిన అన్ని వ్యవహారాలు కూడా చూసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం తన పూర్తి సమయాన్ని భర్త పిల్లలను చూసుకోవడానికి, మహేష్ వ్యాపార భాద్యతలు చూసుకోవడంతో గడుపుతున్నారు నమ్రత. ఇక సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు పలు పోస్ట్ లను షేర్ చేసుకుంటూనే ఉంటారు. తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా నమ్రత ఎప్పటికప్పుడూ తన ఇన్ట్సాలో పోస్ట్ చేస్తూనే ఉంటారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజాగా మరో హార్ట్ ఫుల్ మెసేజ్ ను తన ఇన్స్టా ద్వారా పంచుకున్నారు నమ్రత. జీవితం అనేది ఒక పూర్తి సర్కిల్ లాంటిది.. ఇది నా లైఫ్ సర్కిల్.. లవ్ యూ మామయ్యగారు.. మా జీవితంలో మిమ్మల్ని కలిగి ఉన్నందుకు మేము చాలా ఆశీర్వదించబడ్డాము.. నాకు తెలుసు మాములు గా అయితే మమ్మీ ఈ ఫ్యామిలీ ఫ్రేమ్ లో ఉండేది.. కానీ ఇప్పుడు ఆమె మన హృదయాల్లో ఉంటుంది.. ఆమె ప్రతిఒక్కరోజును మనం సెలబ్రేట్ చేద్దాం.. మనకు తెలుసు తను మన ఫ్యామిలీని ఎప్పుడూ కాపాడుతుంటారని.. లవ్ యూ మమ్మీ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

కాగా ఇటీవలే సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మృతి చెందిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడిన ఇందిరా దేవి గారు ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇక 11 రోజుల పెద్ద కర్మ కూడా రెండు రోజుల క్రితమే నిర్వహించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 1 =