ఈషాన్ సూర్య దర్శకత్వంలో విష్ణు హీరోగా వస్తున్న సినిమా జిన్నా. ఈసినిమాలో విష్ణు గాలి నాగేశ్వర్రావు అనే పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా అక్టోబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈసినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటం తో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో స్పీడును పెంచారు. నిజానికి ఈసినిమా ప్రమోషన్స్ ను ఎప్పటినుండో మొదలుపెట్టారు. సినిమా షూటింగ్ అప్పటినుండి విష్ణు ఫన్నీ వీడియోస్ ను షేర్ చేస్తూనే వచ్చాడు. అంతేకాదు మరోవైపు పాటలు, టీజర్ కూడా రిలీజ్ చేసి సినిమాపై మంచి క్యూరియాసిటీని పెంచారు. ఇక దసరా పండుగ రోజు ట్రైలర్ కూడా రిలీజ్ చేయగా.. ఫుల్ హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించినట్టు అర్థమవుతుంది. ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా నుండి ఇప్పటికే పలు కీలక పాత్రలకు సంబంధించిన పోస్టర్లు రిలీజ్ చేస్తూనే వస్తున్నారు. దీనిలో భాగంగానే తాజాగా చిత్ర యూనిట్ సునీల్ క్యారెక్టర్ పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. ఇందులో సునీల్ పెంచలయ్యగా కనిపించనున్నారు. ఈ పాత్రలో అందరినీ మెప్పించబోతున్నాడు.
కాగా ఈసినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటి సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. కథ, స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్. డాషింగ్ సినిమాటోగ్రాఫర్ చో టా.కె.నాయుడు.. భాను, నందు డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: