యాక్షన్ సీన్స్ తో ప్రారంభం అయిన #RAPO20 మూవీ షూటింగ్

#RAPO20 Movie Latest Update, #RAPO20, #RAPO20 Movie, Actor Ram Pothineni, Director Boyapati Srinu, Actress Sreeleela, Ram Pothineni Latest Movie, Ram Pothineni's Upcoming Movie, RAPO 20, RAPO 20 Telugu movie, RAPO 20 New Update, RAPO 20 Telugu Movie New Update, RAPO 20 Movie, RAPO 20 Latest Update, RAPO 20 Movie Updates, RAPO 20 Telugu Movie Live Updates, RAPO 20 Telugu Movie Latest News, RAPO 20 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

పలు యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీస్ తో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా హీరో రామ్ మరో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ #RAPO20 మూవీ పూజ కార్యక్రమాలు జరుపుకున్న విషయం తెలిసిందే.దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానున్న #RAPO20 మూవీలో పెళ్ళి సందD మూవీ ఫేమ్ శ్రీలీల కథానాయికగా ఎంపిక అయ్యారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్న #RAPO20 మూవీ 6వ తేదీ రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ యాక్షన్ ఎపిసోడ్‌తో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ .. అఖండ విజయం తర్వాత దర్శకుడు బోయపాటి చేస్తున్న చిత్రమిదనీ , బోయపాటి శ్రీను, రామ్ కాంబినేషన్‌లో సినిమా అనగానే ప్రేక్షకులలో అంచనాలు పెరిగాయనీ , వాటికి తగ్గట్టు సినిమా ఉంటుందనీ , హీరో రామ్ ఎనర్జీకి పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యే క్యారెక్టర్‌ను బోయపాటి డిజైన్ చేశారనీ , స్టంట్ శివ నేతృత్వంలో ఆ యాక్షన్ దృశ్యాలు తెరకెక్కిస్తున్నామనీ , సుమారు 30 రోజులు ఈ షెడ్యూల్ ఉంటుందనీ , పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునే కథతో, ఉన్నత సాంకేతిక విలువలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారీ చిత్రమిదనీ , ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తామనీ తెలిపారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − thirteen =