లక్ష్మణ్ కె కృష్ణ డైరెక్షన్ లో గణేష్ హీరోగా వస్తున్న సినిమా స్వాతిముత్యం. ఈసినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు గణేష్. ఇక ఈసినిమాపై మొదటినుండి మంచి అంచనాలే ఉన్నాయి. ఇక అలాంటి అంచనాల మధ్య ఈసినిమా దసరా పండుగ సందర్భంగా ఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మొదటి సినిమా గణేష్ కు ఎలాంటి విజయం అందిస్తుంది.. ఈసినిమా ఎలా టాక్ ను సొంతం చేసుకుంది అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు.. బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ, నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద తదితరులు
దర్శకత్వం.. లక్ష్మణ్ కె కృష్ణ
బ్యానర్స్.. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్
నిర్మాతలు.. సూర్యదేవర నాగవంశీ
సంగీతం.. మహతి సాగర్
సినిమాటోగ్రఫి.. సూర్య
కథ
బాలమురళీకృష్ణ (గణేశ్ బెల్లంకొండ) అలియాస్ బాల ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తుంటాడు. అయితే మొదటి నుండి అమ్మాయిలకు కాస్త దూరంగా ఉండేవాడు. మరోవైపు తల్లిదండ్రుల చాదస్తం కారణంగా పెళ్లి కుదరక ఇబ్బంది పడుతుంటాడు. ఈక్రమంలో ఓ పెళ్లిచూపుల్లో భాగ్యలక్ష్మి ( వర్ష బొల్లమ్మ ) తో ప్రేమలో పడతాడు. రకరకాల సమస్యలను దాటుకొని వారి ప్రేమ.. పెళ్లీ పీటల వరకు వస్తుంది. అయితే, సాయంత్రం పెళ్లి అనగా బాలమురళీకృష్ణ గురించి ఒక షాకింగ్ విషయం తెలుస్తోంది. శైలజ (దివ్య శ్రీపాద) అనే యువతి ఓ తొమ్మిది నెలల బిడ్డను తీసుకొచ్చి.. ఈ బాబు నీ కుమారుడు అని బాల చేతిలో పెడుతుంది. దాంతో పెళ్లి రద్దు అవుతుంది. మరి ఇంతకీ ఆ బేబి ఎవరు.. ఆ తర్వాత బాలమురళీకృష్ణ జీవితంలో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి? చివరకు బాలమురళీకృష్ణ, భాగ్యలక్ష్మి పెళ్లి అయిందా ? లేదా ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ..
ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది వారసులు ఎంట్రీ ఇచ్చారు. ఎవరికి వారు తమ సత్తాను చాటుకుంటూ తమ కెరీర్లో దూసుకుపోతున్నారు. ఇప్పటికే బెల్లంకొండ ఫ్యామిలీ నుండి శ్రీనివాస్ ఎంట్రీ ఇచ్చి ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు తమ్ముడు గణేష్ ఎంట్రీ ఇస్తుండటంతో అందరి దృష్టి పడింది. అయితే నిజానికి ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ అన్నీ సినిమాపై మంచి అంచనాలు పెంచేశాయి. మంచి కామెడీ ఎంటర్ టైనర్ అని ఈసినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు. ఇప్పుడు ఆ నమ్మకం నిజం అయిందని చెప్పొచ్చు.
మంచి డీసెంట్ కథతో వచ్చాడు లక్ష్మణ్ కే కృష్ణ. ఫస్ట్ హాఫ్ అంతా నటీనటులు ఇంట్రడక్షన్ ఆతరువాత.. బాలా, భాగ్యలక్ష్మి ప్రేమ.. పెళ్లి సన్నివేశాలతో.. వివాహ గడియలు సమీపిస్తున్న సమయంలో శైలజ ఎంట్రీతో కథ కంప్లీట్ టర్న్ తీసుకొంటుంది. ఫస్టాఫ్‌లో చిన్న ట్విస్టుతో ముగియడమే కాకుండా సెకండాఫ్‌పై అంచనాలు పెంచుతుంది. సెకండాఫ్‌లో పెరిగిన అంచనాలకు తగినట్టే మంచి స్క్రీన్ ప్లేతో హిలేరియస్ కామెడీతో.. చివరిలో ఎమోషనల్ గా రన్ అయిపోతుంది. మొదటి సినిమా అయినా కూడా లక్ష్మణ్ చాలా బాగా ఎగ్జిక్యూటివ్ చేయగలిగాడు. ఎమోషనల్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ నేపథ్యంలో కథ రాసుకోవడం లక్ష్మణ్ కు కలిసొచ్చిన అంశం.
పెర్ఫామెన్స్
ఇక హీరో గణేష్ విషయానికొస్తే మొదటి సినిమా ఏదో ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ అంటూ హడావుడి చేయకుండా చాలా డీసెంట్ పాత్రతో వచ్చాడు. తన బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా పాత్రను ఎంచుకోవడంలోనే సగం సక్సెస్అయ్యాడు. అమాయకత్వం, నిజాయితీతో కూడిన బాల పాత్రలో గణేష్ ఒదిగిపోయాడు. అంతేకాదు ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా బాగానే నటించాడు.. మొదటి సినిమాకే తన నటనతో ఆకట్టుకున్నాడు..
హీరోయిన్ గా చేసిన వర్ష బొల్లమ్మ భాగ్యలక్ష్మి పాత్రలో నటించి తన నటన తో బాగానే ఆట్టుకుంటుంది. ఆమె పాత్ర కూడా కామెడీగా సాగుతూ బాగానే ఎంటర్ టైన్ చేస్తోంది. హీరో తండ్రి పాత్రలో నటించిన రావు రమేష్ విలక్షణమైన నటనతో మరోసారి చెలరేగిపోయాడు. తనదైన మేనరిజమ్స్, యాస, భాష, హావభావాలతో సినిమాకు హైలెట్‌గా నిలిచాడు. హీరోయిన్ కి తండ్రి పాత్రలో నటించిన సీనియర్ నరేష్ కూడా తన పాత్రకు తగ్గట్లుగానే మంచి కామెడీని పంచాడు. ఇక మిగిలిన నటీనటులు గోపరాజు రమణ నటన హైలైట్. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ అలాగే ఇతర నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
ఇక టెక్నికల్ వాల్యూస్ విషయానికొస్తే మహతి స్వర సాగర్ ఫీల్ గుడ్ మ్యూజిక్ అందించాడు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను మరింత ఎమోషనల్‌గా మార్చింది. సినిమాటోగ్రఫి కూడా చాలా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను కెమెరామెన్ ఎంతో రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.
ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా మంచి ఎమోషనల్ కామోడీ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. అన్ని వర్గాల వారు ఈసినిమాను చూసి ఎంజాయ్ చేయొచ్చు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: