క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్.. 40 ఏళ్ల కల పొన్నియన్ సెల్వన్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా మణిరత్నం పొన్నియన్ సెల్వన్ సినిమాను తెరకెక్కించాడు. చోళుల కథ ఆధారంగా తెరకెక్కిన ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన ఈసినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. మణిరత్నం టేకింగ్ అలాగే విజువల్ వండర్ గా ఈసినిమా ఉందన్న ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే కొన్నిచోట్ల మాత్రం ఈసినిమాకు మిశ్రమ స్పందన వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాకు కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి. ఈసినిమా మొదటిరోజు మంచి వసూళ్లు రాబట్టింది. నార్త్ లో కూడా ఈసినిమా మంచి కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటుంది. హిందీలో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ ల చిత్రం ‘విక్రమ్ వేద’ నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నప్పటికీ మంచి ఓపెనింగ్స్ సాధించాయి. ముఖ్యంగా తమిళనాడులో ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. తొలి రోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన తమిళ చిత్రంగా నిలిచింది. తమిళనాడులో 25.86 కోట్లకు పైగా కలెక్షన్స్ ను వసూలు చేసింది. అంతేకాదు ఓవరీస్ లో కూడా ఈసినిమా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికే 2మిలియన్ డాలర్ల ను సొంతం చేసుకొని రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా 80 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టుకున్నట్టు అధికారికంగా తెలియచేశారు.
కాగా ఈసినిమాలో విక్రమ్, కార్తీ, త్రిష, పార్తిబన్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, జయరామ్, జయం రవి తదితరులు కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మించాయి. తమిళంతో పాటు హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈసినిమా రిలీజ్ అయింది. ఈసినిమాకు ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: