టాలీవుడ్ అగ్రహీరోలు కూడా ఎక్కడా తగ్గకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. వారికి ఏమాత్రం తగ్గకుండా యాక్షన్ సీక్వెన్స్ లలో కూడా చేసేస్తున్నారు. తాజాగా బాలకృష్ణ సినిమాకు సంబంధించి ఫొటోలు బయటకు రావడంతో ఆ ఫొటోలు చూసిన వారు బాలకృష్ణ ఫెరోషియస్ మేకోవర్ చూసి అభిమాలు ఫిదా అవుతున్నారు. నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని క్రేజీ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతానికి #NBK107 వర్కింగ్ టైటిల్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే అక్కడ యాక్షన్ సీక్వెన్స్ కు సంబంధించి షూటింగ్ జరుగుతుండగా దానికి సంబంధించిన ఒక వీడియో బయటకు వచ్చింది. ఆ లీక్ అయిన వీడియోలో నందమూరి బాలకృష్ణ బ్లాక్ షర్ట్ తెల్ల పంచె కట్టుకొని దుండగులతో పోరాడుతున్నట్లు కత్తితో వారికి వార్నింగ్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో ఈసినిమాలో కూడా యాక్షన్ సీక్వెన్స్ ఓ రేంజ్ లో ఉండనున్నట్టు తెలుస్తుంది.
కాగా ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో బాలయ్యకు విలన్ గా కన్నడ విలక్షణ నటుడు దునియా విజయ్ నటించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన్సర్ పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ కలిసి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు సినిమాటోగ్రఫి రిషి పంజాబీ అందిస్తున్నాడు. సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: