ఏజెంట్ తో కలిసి సినిమా చేస్తున్నా

Nagarjuna About Acting With Akhil,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Telugu Film News 2022,Nagarjuna,Akkineni Nagarjuna,Nagarjuna latest Updates,Nagarjuna Upcoming Movies,Nagarjuna New Movie Updates,Nagarjuna Latest News,Nagarjuna Upcoming Movie The Ghost,Nagarjuna The Ghost Movie Updates,Nagarjuna THe Ghost Movie Pre Release Event,Nagarjuna About Acting With Nikhil in Upcoming Movie,Nagarjuna and Nikhil To act in Upcoming Movie Say Nagarjuna,The Ghost Pre Release Event,The Ghost to Release on october 5th,Nagarjuna Movie Releasing on 5th October

మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఇప్పుడున్న హీరోలు ఏమాత్రం వెనుకడుగు వేయట్లేదు. ఒకప్పుడు డైరెక్టర్లు మాత్రమే కాదు.. హీరోలు కూడా మల్టీస్టారర్లు చేయడానికి ముందుకొచ్చేవారు కాదు. దానికి పలు కారణాలు ఉండేవి. కానీ ఇప్పుడు కథకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.. పాత్ర నిడివి తక్కువైనా పర్వాలేదు కానీ కంటెంట్ ఉంటే సినిమాలు చేయడానికి సిద్దమవుతున్నారు. ఇక ఈనేపథ్యంలోనే గత కొంతకాలంగా పలు సినిమాలు వచ్చాయి. ఇంకా వస్తునేఉన్నాయి. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ తెరపైకి రానుంది. అదే నాగార్జున-అఖిల్ కాంబినేషన్. దీనికి కారణం ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజున నాగార్జున చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్సే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా వస్తున్న సినిమా ది ఘోస్ట్. ఈసినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కర్నూల్ లో జరిగింది. ఇక ఈసందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. 33 ఏళ్ల క్రితం ‘శివ’ అనే సినిమా మీ ముందుకు వచ్చింది .. అప్పుడు ‘చైన్’ పట్టుకుని వచ్చాను. అదే అక్టోబర్ 5వ తేదీన ఈ సారి ఒక ‘కత్తి’ పట్టుకుని వస్తున్నాను. విజయదశమి అందరికీ విజయాన్ని ఇస్తుందని అంటారు. ఈ పండగ ‘ది ఘోస్ట్’ సినిమాకి విజయాన్ని ఇస్తుందని భావిస్తున్నాను. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ అఖిల్ తో చేయబోతున్నాను. ‘ఏజెంట్’ .. ‘ఘోస్ట్’ కలిస్తే ఎలా ఉంటుందో .. ఆ సినిమా అలా ఉంటుంది అని తెలిపాడు. మరి చూద్దాం వీరిద్దరి కాంబినేషన్ లో ఎప్పుడు సినిమా వస్తుందో..

కాగా ఈసినిమాలో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో నాగార్జున, సోనాల్ చౌహాన్ ఇద్దరూ ఇంటర్‌పోల్ ఆఫీసర్స్‌గా కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాలో గుల్‌పనాగ్‌, అనిఖ సురేంద్రన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్‌పీ, నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్ మెంట్స్ బ్యాన‌ర్ల‌పై సునీల్ నారంగ్‌, పీ రామ్మోహ‌న్ రావు, శ‌ర‌త్ మ‌రార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + thirteen =