పోల్ గేమ్ :దసరా (అక్టోబర్ 5) రిలీజ్ కానున్న ఏ మూవీకి మీ ఓటు ?

For Which Dasara Release You Are More Excited?,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Telugu Film News 2022,Movies That Releasing On October 5th,Tollywood Movies Releasing on October 5th,Vote For the Best Movie Releasing on 5th october Dussehra Festival,Telugu Movies Releasing on Dussehra Festival 5th October,Vote For The Best Movies Releasing on Dussehra Festival 2022,Big Movies Releasing on Dussehra Festival,Movies That Releasing,Megastar Chiranjeevi,Chiranjeevi,Chiranjeevi Godfather Movie,Godfather Movie Releasing on Dussehra Festival,Akkineni Nagarjuna The Ghost Movie,Nagarjuna The Ghost Telugu Movie Releasing on Dussehra,Swathi Muthyam Movie,Swathi Muthyam Telugu Movie,Swathi Muthyam Movie Releasing On Dussehra,Swathi Muthyam Telugu Movie Releasing on 5th October,Swathi Muthyam Movie latest Updates,Bellamkonda Ganesh Babu,Bellamkonda Ganesh Babu Movie Swathi Muthyam

గాడ్ ఫాదర్ : కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సూపర్ హిట్ లూసిఫర్ మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ దసరా పండగ కానుకగా అక్టోబర్ 5వ తేదీ రిలీజ్ కానుంది.ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో, సత్యదేవ్, అనసూయ, దర్శకుడు పూరి జగన్నాథ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన  గాడ్ ఫాదర్ మూవీ  పోస్టర్స్, ఫస్ట్ సింగిల్, టీజర్ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ది ఘోస్ట్ : శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సూపర్ హిట్ PSV గరుడ వేగ మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ ది ఘోస్ట్ మూవీ విజయదశమి సందర్భంగా అక్టోబర్‌ 5న విడుదల కానుంది. సోనాల్ చౌహాన్ కథానాయిక కాగా మనీష్ చౌదరి ప్రతినాయకుడిగా నటించారు. ఈ మూవీ లో గుల్ పనాగ్ , అనిఖ సురేంద్రన్ , శ్రీకాంత్ అయ్యంగార్ , రవి వర్మ ముఖ్య పాత్రలలో నటించారు. భరత్ శౌరభ్ సంగీతం అందించారు.హీరో నాగార్జున , సోనాల్ చౌహాన్ ఇంటర్ పోల్ ఆఫీసర్స్ గా నటించిన ది ఘోస్ట్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ గ్లింప్స్ , సాంగ్ , ట్రైలర్ , గన్స్ అండ్ స్వార్డ్స్ యాక్షన్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

స్వాతిముత్యం: పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వంలో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సోదరుడు బెల్లంకొండ గణేష్ , వర్ష బొల్లమ్మ జంటగాతెరకెక్కిన స్వాతిముత్యం మూవీ అక్టోబర్ 5 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద ముఖ్య పాత్రలలో నటించారు. సాగర్ మహతి సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇద్దరుసీనియర్ హీరోల సినిమాలతో పోటీపడి స్వాతిముత్యం మూవీ దసరా పండగ కు రిలీజ్ కావడం విశేషం.

[totalpoll id=”87999″]

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.