ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ , సురేందర్ 2 సినిమా బ్యానర్స్ పై స్టైలిష్ మూవీస్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా స్పై థ్రిల్లర్ ఏజెంట్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సాక్షి వైద్య కథానాయిక. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. హీరో అఖిల్ బర్త్ డే సందర్భంగా అఖిల్ ఫస్ట్ లుక్ , టైటిల్ పోస్టర్, సాక్షి వైద్య బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఉన్నతమైన సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న ఏజెంట్ మూవీతో ముంబై బ్యూటీ , మోడల్ సాక్షి వైద్య టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు.భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానుంది. మొదటి సినిమా రిరిలీజ్ కాకుండానే సాక్షి వైద్య ఇప్పుడు మరో టాలీవుడ్ ఆఫర్ అందుకున్నట్టు సమాచారం. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కుతున్న RAPO 20 మూవీ లో హీరో రామ్ కు జోడీగా సాక్షి వైద్య ఎంపిక అయినట్టు సమాచారం.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: