ఓరి దేవుడా వెంకీ ఇంట్రడక్షన్ గ్లింప్స్ రిలీజ్

Venkatesh Surprise Glimpse from Ori Devuda Out Now, Venkatesh Surprise Glimpse Released, Ori Devuda Movie Official Update, Ori Devuda is the upcoming romantic comedy from Vishwak Sen, Vishwak Sen's Ori Devuda Movie, Ori Devuda Movie, Ori Devuda Telugu Movie, Oh My Kadavule, Ashwath Marimuthu, Director Ashwath Marimuthu, Venky Mama, glimpse of Venkatesh, Ori Devuda glimpse of Venkatesh, Venky Mama Surprise Glimpse, Ori Devuda is going to be released this Diwali on October 21st, Vishwak Sen And Mithila Palkar Starrer Ori Devuda Movie, Vishwak Sen And Mithila Palkar's Ori Devuda Telugu Movie, Ori Devuda Movie Latest News And Updates, Telugu Film News 2022, Latest Telugu Movies News, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates

రీసెంట్ గా అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఆసినిమాతో డీసెంట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జంటగా నటిస్తున్న సినిమా ఓరి దేవుడా. తమిళ్‌లో సూపర్ హిట్ అయిన ఓమై కడవులే సినిమాకు ఇది రీమేక్ అన్న విషయం తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా.. మరోవైపు ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఈసినిమా నుండి పలు అప్ డేట్లు ఇచ్చారు చిత్రబృందం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. నిజానికి ఈసినిమాలో అగ్రహీరో విక్టరీ వెంకటేష్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు ఆ వార్తలే నిజమయ్యాయి. ఈసినిమాలో వెంకీ కూడా నటిస్తున్నారు. ఈనేపథ్యంలో తాజాగా తనకు సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. విజయ్ సేతుపతి పాత్రలో వెంకీ నటిస్తున్నట్టు తెలుస్తుంది.

కాగా పివిపి సినిమా, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ల మీద పెరల్ వి పొట్లూరి, పరమ్ వి పొట్లూరి, దిల్ రాజు ఈసినిమాను నిర్మిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్న ఈసినిమాకు సినిమాటోగ్రఫి విధు.

తమిళ్ లో సూపర్ హిట్ అయిన ఈసినిమాలో అశోక్ సెల్వన్, రితికా సింగ్, వాణి భోజన్ లీడ్ రోల్స్ చెయ్యగా.. విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించారు. చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ అయిన హీరో, హీరోయిన్ లవ్ మ్యారేజ్ చేసుకోవడం, తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకుల కోసం కోర్టుకెళ్లడం నేపథ్యంలో ఈసినిమా ఉంటుంది. మరి ఈ సినిమా తెలుగులో ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + seven =