లక్కీ మీడియా బ్యానర్ పై ప్రదీప్ వర్మ దర్శకత్వంలో శ్రీవిష్ణు , కయడు లోహర్ జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ అల్లూరి మూవీ సెప్టెంబర్ 23 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో శ్రీవిష్ణు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ మూవీ లో సుమన్ , తనికెళ్ళ భరణి , రాజా రవీంద్ర ముఖ్య పాత్రలలో నటించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథి గా పాల్గొన్న అల్లూరి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈఈవెంట్ లో హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. నిర్మాత , దర్శకులకు థ్యాంక్స్ అనీ , ప్రేమ ఇష్క్ కాదల్ మూవీలో నటించిన తరువాత అల్లు అర్జున్ తన ఇంటికి పిలిపించి తనతో మాట్లాడారనీ , మీ యాక్టింగ్ చాలా బాగుంది, తప్పకుండా మీకు మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని చెప్పారనీ , అలా వచ్చిన అవకాశాలు ఏవి పడితే అవి ఒప్పేసుకోవద్దనీ , కెరీర్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని మంచి కంటెంట్ ఉన్న సినిమాలే చేయండి, మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా తాను చేస్తాననీ చెప్పారనీ , దాంతో కంటెంట్ ఉన్న సినిమాలే చేయడానికి సిద్ధం అయ్యాననీ , తన కెరీర్ ని ఇలా చక్కగా ప్లాన్ చేసుకోవడానికి కారకులైన అల్లు అర్జున్ గారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువేననీ చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: