పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న కింగ్ నాగార్జున ఈ సంవత్సరం సూపర్ హిట్ బంగార్రాజు , బ్రహ్మాస్త్ర మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున , సోనాల్ చౌహన్ జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ ది ఘోస్ట్ మూవీ దసరా పండగ కానుకగా అక్టోబర్ 5 వ తేదీ రిలీజ్ కానుంది. తాజాగా నాగార్జున ప్రపంచంలో ఏ నటుడికీ సాధ్యం కానీ అరుదైన రికార్డ్ ను సాధించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకే హీరోయిన్.. తండ్రీ కొడుకుల సరసన యాక్ట్ చేయడం చాలా రేర్ అనే చెప్పాలి. తెలుగు,హిందీ, తమిళ చిత్ర పరిశ్రమలో తండ్రి సరసన నటించిన హీరోయిన్లు చాలా మంది కొడుకుల సరసన నటించారు.అక్కినేని నాగేశ్వర రావు సరసన నటించిన శ్రీదేవి, రాధ,రమ్యకృష్ణ లతో ఆయన తనయుడైన నాగార్జునకు జోడిగా నటించారు.తండ్రి ఏఎన్ఆర్ సరసన నటించిన హీరోయిన్స్‌తో పాటు కొడుకు నాగ చైతన్యకు జోడిగా నటించిన లావణ్య త్రిపాఠి, రకుల్ ప్రీత్ సింగ్ లతో నాగార్జున నటించారు. అటు తండ్రి ఏఎన్ఆర్ సరసన నటించిన హీరోయిన్స్‌తో పాటు..ఇటు తనయుడు నాగ చైతన్యకు జోడిగా నటించిన హీరోయిన్స్ తో సిల్వర్ స్క్రీన్‌పై జోడిగా నటించిన ఏకైక హీరోగా నాగార్జున రికార్డ్ క్రియేట్ చేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: