వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన సీతారామం మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో ఆగస్ట్ 5 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.హీరో దుల్కర్ , మృణాల్ ఠాగూర్ , రష్మిక , సుమంత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.విశేష ప్రేక్షకాదరణతో సీతా రామం ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.ఈ మూవీ కి బాలీవుడ్ లో కూడా అద్భుత స్పందన లభించింది. సీతారామం మూవీ ప్రపంచవ్యాప్తంగా 90 కోట్ల గ్రాస్ , 40 కోట్ల షేర్ తో రికార్డ్ క్రియేట్ చేసి, దుల్కర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సీతారామం మూవీ సీక్వెల్ పై దుల్కర్ సల్మాన్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. ఒక క్లాసిక్ సినిమా ప్రేక్షకులకు నిజంగా నచ్చుతుందని ఒక నటుడిగా తనకు తెలుసుననీ , సీతారామం అనేది ఒక ఇతిహాసం. ఇది ఓ క్లాసిక్ సినిమా అవుతుందని ముందే మేము అనుకున్నామనీ , మా ప్రయత్నం ప్రేక్షకులను మెప్పిస్తుందా ? లేదా? అనేది మాకు తెలియదనీ , ఈ సినిమా కోసం మేము ఎంతో కష్టపడ్డామనీ , ఈ సినిమాపై మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలనీ , ఇది మళ్లీ మళ్లీ తీసే సినిమా అని తా ను అనుకోవడం లేదనీ చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: