రెగ్యులర్ షూట్ కు రెడీ అవుతున్న హరిహర వీరమల్లు

Hari Hara Veera Mallu Movie Latest Update, Hari Hara Veera Mallu Telugu Movie Latest Update, Hari Hara Veera Mallu, Hari Hara Veera Mallu Latest Update, Hari Hara Veera Mallu New Update, Pawan Kalyan's Hari Hara Veera Mallu, Hari Hara Veera Mallu Update, Pawan Kalyan and Nidhhi Agerwal's Hari Hara Veera Mallu, Pawan Kalyan, Nidhhi Agerwal, Power Star Pawan Kalyan, Power Star Pawan Kalyan Latest Movies, Pawan Kalyan Upcoming Movies, Power Star Pawan Kalyan Hari Hara Veera Mallu, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News,

వవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోపక్క సినిమాలను చేసుకుంటూ వెళుతున్నారు. అయితే ఆయన రాజకీయల్లో బిజీగా ఉండటంతో ఆ ఎఫెక్ట్ మాత్రం సినిమా షూటింగ్ లపై ఖచ్చితంగా పడుతుంది అని చెప్పొచ్చు. దానికి నిదర్శనమే హరిహర వీరమల్లు సినిమా. ఎపుడో పూర్తి కావాల్సిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ఆలస్యమవుతూ వస్తోంది. క్రిష్ దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో ఈసినిమా వస్తుండగా.. ఈసినిమాను భీమ్లానాయక్ కంటే ముందు మొదలుపెట్టాడు. ఆ సినిమా కూడా ముందు కంప్లీట్ అయి రిలీజ్ అయిపోయింది. ఇక హరిహర వీరమల్లు సినిమాకే ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి. ఈసినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ఫ్యాన్స్ కోరిక కూడా ఇప్పట్లో తీరేలా కనిపించట్లేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పటికే ఈసినిమా షూటింగ్ పై పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూట్ ను అక్టోబర్ 17 నుండి మొదలు పెట్టలని ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు ఈసారి మాత్రం గ్యాప్ లేకుండా షూట్ ను పూర్తి చేసి త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలు పెట్టాలని చూస్తున్నారట. చూద్దాం మరి ఈసారైనా షూటింగ్ ను మొదలుపెడతారో లేదో?

కాగా ఈసినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జోడీగా నిధి అగ‌ర్వాల్ నటిస్తుండగా.. బాలీవుడ్ నుండి అర్జున్‌ రాంపాల్‌ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తన మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ప్రముఖ సంగీత ద‌ర్శకుడు యం.యం.కీర‌వాణి సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫ‌ర్ జ్ఞాన ‌శేఖ‌ర్ వి.ఎస్‌. సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

మరి పవన్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్ కు మాత్రం సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. మరి ఈసినిమాను వచ్చే ఏడాది సమ్మర్ బరిలో దించనున్నారు కాబట్టి ఈసినిమాతో పవన్ హ్యాట్రిక్ ను సొంతం చేసుకుంటారేమో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =