మహర్షి నటుడు గురుస్వామి మృతి

Maharshi fame Guru Swamy Passed Away, Guru Swamy Passed Away, Maharshi fame Actor Guru Swamy Passed Away, Actor Guru Swamy Passed Away, Guru Swamy passed away due to health issues, Guru Swamy Passed Away, Guru Swamy Passes Away, Actor Guruswamy, Guru Swamy, Guru Swamy Facing health issues, Maharshi fame Guru Swamy, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News

కొంతమందికి ఊహించని విధంగా సినిమాల్లో నటించే అవకాశం వస్తుంది. ఒక్క సినిమా చేసినా కూడా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటారు. అప్పట్లో వేదం సినిమాలో నటించిన తాత ఒక్క సినిమాతోనే అందరికీ గుర్తుండి పోయాడు. ఇక ఇటీవల కాలంలో వచ్చిన మహర్షి సినిమాలో నటించిన గురస్వామి కూడా ఆసినిమాలో రైతుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మహేష్ తాత నాకు వ్యవసాయం నేర్పిస్తావా అని అడగగా.. ‘ఒక్క‌సారి ఈ మ‌ట్టిలో కాలుపెడితే ఆ భూదేవి త‌ల్లే లాగేసుకుంట‌ది…రా’ అంటూ.. వ్యవసాయం ప్రాముఖ్యతను తెలియచెప్పిన గురుస్వామి మాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే తన పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్న గురుస్వామి నేడు తుదిశ్వాస విడిచారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతిచెందారు. ఇక గురుస్వామి మృతి చెందిన విషయం తెలుసుకుని పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన గురుస్వామి నాటక రంగంపై ఇష్టంతో తాను చేస్తున్న ఉద్యోగాన్ని మానేశారు. అటుపై పలు నాటకాల్లో ఆయన నటించారు. కాగా, ఆయుష్మాన్ భవ అనే షార్ట్ ఫిలింలో ఆయన పర్ఫార్మెన్స్‌కు మంచి పేరు వచ్చింది. ఆ షార్ట్ ఫిలిం చూసే మహర్షి సినిమాలో ఆయన్ను మహర్షి మేకర్స్ సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు ప్రధానపాత్రలో తెరకెక్కిన సినిమా మహర్షి. మహర్షి మూవీలో మహేష్ సరసన పూజా హెగ్డే నటించగా, అల్లరి నరేష్ కీలక పాత్ర చేశారు. ఇక ఈసినిమాలో స్నేహం అలానే రైతుసమస్యల గురించి కూడా చెప్పడంతో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. అంతేకాదు ఈసినిమా జాతీయ అవార్డులను సైతం అందుకుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.