చాలా గ్యాప్ తరువాత మంచు విష్ణు మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈషాన్ సూర్య దర్శకుడిగా పరిచయం అవుతూ.. మంచు విష్ణు హీరోగా వస్తున్న సినిమా జిన్నా. ఈసినిమా టైటిల్ విషయంలో ముందు పలు అభ్యంతరాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విష్ణు పేరు గాలి నాగేశ్వర్రావు కావడంతో ఆ పేరు నచ్చక జిన్నాగా మార్చుకుంటాడని ఇప్పటికే మేకర్స్ క్లారిటీ కూడా ఇచ్చారు. ఇక ఈసినిమాపై మొదటి నుండి మంచి అంచనాలే ఉన్నాయి. దీనికితోడు విష్ణు కూడా ఎప్పటికప్పుడు షూటింగ్ సమయంలో కూడా పలు వీడియోలు పోస్ట్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీని పెంచాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా.. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇప్పటికే ఈసినిమా నుండి వరుసగా ఫస్ట్ లుక్ పోస్టర్లను, దీనితో పాటు ఫ్రెండ్ షిప్ సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక తాజాగా ఈసినిమా టీజర్ రిలీజ్ కు డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. నిజానికి ఈసినిమా టీజర్ ను ముందు ఆగష్ట్ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అప్పుడు కుదరలేదు. ఇక ఇప్పుడు కొత్త టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. సెప్టెంబర్ 9వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈమేరకు ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.
Get ready for a whirlwind of adventure, thrill and entertainment as #Ginna arrives soon ⏳
Teaser on 9th Sept.@iVishnuManchu @SunnyLeone @starlingpayal @konavenkat99 @anuprubens @eeshaansuryaah #PremRakshith #ChotaKNaidu @Mee_Sunil @PDdancing @avaentofficial @24FramesFactory pic.twitter.com/lHfEtYOy5c— paayal rajput (@starlingpayal) September 7, 2022
కాగా ఈసినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటి సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. కథ, స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్. డాషింగ్ సినిమాటోగ్రాఫర్ చో టా.కె.నాయుడు.. భాను, నందు డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: