సినిమా నిర్మాణ వ్యయం కంట్రోల్ చేయాలని గత కొన్ని రోజులుగా షూటింగ్స్ అన్నీ ఆపేసి తెలుగు నిర్మాతలు చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలోని అన్ని శాఖల వారితో చర్చలు జరిపి.ఫైనల్ గా నిర్ణయం తీసుకుంటామని నిర్మాతలు చెబుతూ వస్తున్నారు.ఆగస్ట్ 25 నుండి షూటింగ్స్ చేసుకోవాలనుకునే వారు నిర్మాతల మండలి నుండి అనుమతి తీసుకుని చేసుకోవచ్చనీ , సెప్టెంబర్ 1 నుండి పూర్తి స్థాయిలో షూటింగ్స్ జరుపుకోవచ్చనీ నిర్మాతలు ప్రకటించారు. తాజాగా ఇప్పటి వరకు జరిపిన చర్చలకు సంబంధించిన సమాచారాన్ని తెలుపుతూ.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపున అధికారికంగా కొన్ని మార్గ దర్శకాలతో ఓ ప్రెస్‌నోట్ విడుదల అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులందరి రెమ్యునరేషన్స్ వారు చేస్తున్న పాత్ర లేదంటే చిత్రాన్ని బట్టి నిర్మాతే నిర్ణయించడం జరుగుతుందనీ , ఒక్కసారి ఆర్టిస్ట్ రెమ్యూనరేషన్ నిర్ణయించిన తర్వాత.. వారి అసిస్టెంట్స్, లోకల్ ట్రాన్స్‌పోర్ట్, వారు బస చేసే హోటల్స్, స్పెషల్ ఫుడ్ అన్నీ ఆ రెమ్యూనరేషన్ పరిధిలోనే ఉంటాయనీ , నటీనటులు రెమ్యూనరేషన్ ఓకే చేసిన తర్వాత.. ఆ అమౌంట్ మినహా నిర్మాత నుండి ఇక ఎటువంటి చెల్లింపులు ఉండవనీ , ఇకపై నటీనటులకు, సాంకేతిక నిపుణులకు డైలీ వైజ్ చెల్లింపులు ఉండవనీ , సాంకేతిక నిపుణులకు సైతం ఒక్కసారి రెమ్యూనరేషన్ మాట్లాడుకున్న అదనంగా ఎటువంటి చెల్లింపులు నిర్మాతల నుంచి ఉండవనీ , సినిమా షూటింగ్ ప్రారంభించే ముందే రెమ్యూనరేషన్లతో సహా అన్ని ఒప్పందాలు తప్పనిసరిగా నమోదు చేయాలనీ , ఒప్పందాలన్నీ ఛాంబర్ ద్వారానే నిర్ధారించబడతాయనీ , కాల్ షీట్స్ విషయంలో ఖచ్చితంగా క్రమశిక్షణ కలిగి ఉండాలనీ , నిర్మాత ప్రయోజనం నిమిత్తం.. షూటింగ్‌కి సంబంధించిన రోజువారీ నివేదికను ఏర్పాటు చేయాలనీ , ఓటీటీ విషయంలో సినిమా టైటిల్స్, అలాగే థియేట్రికల్ రిలీజ్ పబ్లిసిటీ సమయాలలో ఓటీటీ మరియు శాటిలైట్ పార్టనర్స్ సంబంధించిన సమాచారం చెప్పరాదనీ , సినిమా రిలీజ్ అయిన 8 వారాల వరకు ఓటీటీలో సినిమా విడుదల చేయరాదనీ , థియేట్రికల్/ ఎగ్జిబిషన్ గురించి చర్చలు సెప్టెంబర్ 3న జరగాల్సి ఉండగా.. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ వారు ఈ సమావేశాన్ని సెప్టెంబర్ 6వ తేదీకి వాయిదా వేయడం జరిగిందనీ , దానికి సంబంధించిన వివరాలు కూడా తెలియజేయడం జరుగుతుందనీ , ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పర్సంటేజే ఆంధ్రప్రదేశ్ మల్టీప్లెక్స్‌కు వర్తిస్తుందనీ , ఫెడరేషన్ వారితో చివరి దశ చర్చలు నడుస్తున్నాయనీ , అవి అయిన తర్వాత ఫైనల్ రేటు కార్డ్స్‌ని అన్ని నిర్మాణ సంస్థలకు పంపించడం జరుగుతుందనీ ఆ ప్రెస్ నోట్ లో ఉంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: