పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ , పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఫన్ , ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ పోస్టర్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.ధమాకా మూవీ ఫస్ట్ సింగిల్ జింతాక్ చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరో రవితేజ – శ్రీలీల జోడీ వేసిన ఎనర్జిటిక్ స్టెప్పులతో కూడిన ఈ ఫోక్ సాంగ్ కు అద్భుతమైన స్పందన వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వినాయక చవితి కానుకగా ఆగస్ట్ 31 వ తేదీ ధమాకా మూవీ గ్లింప్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ గ్లింప్స్ లో రవితేజ , శ్రీలీలకి రొమాంటిక్ గా సిగ్నల్స్ ఇస్తూ ఫేషియల్ ఎక్స్ ప్రెషన్స్ తో పక్కకు రమ్మనగా అతడి ప్రయత్నానికి చివరికి కరిగిపోయి శ్రీలీల అతనికి ఆమోదం తెలిపింది.శ్రీలీల సాంప్రదాయ చీరలో అద్భుతంగా కనిపించారు .రవితేజ యూత్ ఫుల్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీ తో పాటు మాస్ మహారాజా రవితేజ హీరోగా రావణాసుర , టైగర్ నాగేశ్వర రావు మూవీస్ సెట్స్ పై ఉన్న విషయం తెలిసిందే. మెగా స్టార్ హీరోగా తెరకెక్కుతున్న “MEGA 154 ” మూవీ లో రవితేజ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























