కింగ్ నాగార్జున , సూపర్ స్టార్ మహేష్ బాబు మల్టీ స్టారర్ ?

Nagarjuna and Superstar Mahesh Babu To Do A Multi-Starrer?,Telugu Filmnagar,Telugu Film News 2022,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News, Nagarjuna,Akkineni Nagarjuna,Hero Nagarjuna,Nagarjuna and Mahesh Babu Multi Starrer,Nargarjuna Latest Upcoming Movie The Ghost,Nagarjuna The Ghost Movie Trailer Released By Mahesh Babu,The Ghost Movie Trailer Launched by Superstar Mahesh Babu,Nagarjuna Tweeted to Mahesh Babu About Multistarrer Movie,Mahesh Babu Happy to do a Movie with Nagarjuna

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సూపర్ హిట్ PSV గరుడ వేగ మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ ది ఘోస్ట్ మూవీ విజయదశమి సందర్భంగా అక్టోబర్‌ 5న విడుదల కానుంది. సోనాల్ చౌహాన్ కథానాయిక కాగా మనీష్ చౌదరి ప్రతినాయకుడిగా నటించారు. ఈ మూవీ లో గుల్ పనాగ్ , అనిఖ సురేంద్రన్ , శ్రీకాంత్ అయ్యంగార్ , రవి వర్మ ముఖ్య పాత్రలలో నటించారు. భరత్ శౌరభ్ సంగీతం అందించారు.హీరో నాగార్జున , సోనాల్ చౌహాన్ ఇంటర్ పోల్ ఆఫీసర్స్ గా నటించిన ది ఘోస్ట్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ది ఘోస్ట్ మూవీ ట్రైలర్ ని సూపర్ స్టార్ మహేష్‌ బాబు ఆవిష్కరించి యూనిట్ కి ప్రత్యేకంగా బెస్ట్ విషెస్ తెలిపారు. థ్రిల్లింగ్, యాక్షన్ తో పాటు గ్రాండియర్ విజువల్స్ తో అదరగొట్టిన ది ఘోస్ట్ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి ఆదరణతో కొనసాగుతోంది. ట్రైలర్ ని రిలీజ్ చేసిన మహేష్ బాబుకి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెబుతూ కింగ్ నాగార్జున, గతంలో 29 ఏళ్ళ క్రితం సూపర్ స్టార్ కృష్ణ తో వర్క్ చేసిన వారసుడు మూవీ మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, మనం ఇద్దరం కూడా ఎందుకు కలిసి యాక్ట్ చేయకూడదు అంటూ ట్వీట్ చేశారు. మీతో వర్క్ చేయడం తనకు కూడా ఎంతో ఆనందంగా ఉంటుందనీ , ఆ రోజు కోసం తాను ఎదురు చూస్తున్నాననీ మహేష్ బాబు రీ ట్వీట్ చేశారు. ఒకవేళ వీరిద్దరూ కలిసి చేసే మూవీ కనుక సెట్ అయితే ఆ మల్టీస్టారర్ నిజంగా బాక్సాఫీస్ దగ్గర పెద్ద ప్రభంజనాన్ని సృష్టిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + twenty =