12 గంటలలో 3 మిలియన్ వ్యూస్ తో ది ఘోస్ట్ ట్రైలర్

Ghost Movie Trailer Gets Superb Response,Telugu Filmnagar,Telugu Film News 2022,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News,The Ghost.The Ghost Movie,The Ghost Telugu Movie,Akkineni Nagarjuna,Nagarjuna The Ghsot Movie,The Ghost Movie Latest Updates,The Ghost Telugu Movie Trailer,Ghost Movie Trailer Gets Superb Response,The Ghost Movie Trailer Gets Huge Response,Akkineni Nagarjuna Upcoming Movie,Nagarjuna New Movie Updates,Nagarjuna Latest Movie Updates

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సూపర్ హిట్ PSV గరుడ వేగ మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ ది ఘోస్ట్ మూవీ విజయదశమి సందర్భంగా అక్టోబర్‌ 5న విడుదల కానుంది. సోనాల్ చౌహాన్ కథానాయిక కాగా మనీష్ చౌదరి ప్రతినాయకుడిగా నటించారు. ఈ మూవీ లో గుల్ పనాగ్ , అనిఖ సురేంద్రన్ , శ్రీకాంత్ అయ్యంగార్ , రవి వర్మ ముఖ్య పాత్రలలో నటించారు. భరత్ శౌరభ్ సంగీతం అందించారు.హీరో నాగార్జున , సోనాల్ చౌహాన్ ఇంటర్ పోల్ ఆఫీసర్స్ గా నటించిన ది ఘోస్ట్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ది ఘోస్ట్ మూవీ ట్రైలర్ సూపర్ స్టార్ మహేష్‌ బాబు చేతుల మీదుగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. థ్రిల్లింగ్, యాక్షన్ తో పాటు గ్రాండియర్ విజువల్స్ తో రూపొందిన ది ఘోస్ట్ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని 12 గంటలలో 3 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ది ఘోస్ట్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 3 =