మెగా కాంపౌండ్ నుండి ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో వైష్ణవ్ తేజ్, ఆ సినిమాతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక ఆతరువాత కొండపొలం సినిమాతో మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు లవర్ బాయ్ లాగ మారిపోతున్నాడు. గిరీశాయ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా రంగ రంగ వైభవంగా. ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక మరోవైపు ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్, పాటలకు ఆడియెన్స్ నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యానర్‌పై బాపినీడు.బి సమర్పణలో.. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. శామ్ దత్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: