సైమా అవార్డులకు అత్యధిక విభాగాలలో నామినేట్ అయిన పుష్ప: ది రైజ్

Pushpa The Rise becomes highest Nominated film for SIIMA Awards,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Pushpa The Rise,Pushpa The Rise Telugu Movie,Pushpa The Rise Movie,Pushpa The Rise Nominated For SIIMA Awards,Pushpa The Rise Movie Becomes Highest Nominated Film For SIIMA Awards,Allu Arjun,Icon Star Allu Arjun,Stylish Star Allu Arjun Pushpa Movie Becomes Highest Nominated Movie For SIIMA Awards,SIIMA Awards

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “పుష్ప: ది రైజ్” మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. అల్లు అర్జున్ , రష్మిక ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. “పుష్ప :ది రైజ్”మూవీ హిందీ వెర్షన్ కూడా ఘనవిజయం సాధించి, బాలీవుడ్ లో అల్లు అర్జున్ పై క్రేజ్ పెంచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సైమా(సౌత్‌ ఇండియన్‌ ఇంటర్‌నేషనల్‌ మూవీ అవార్డ్స్‌) వేడుక ఈ ఏడాది బెంగళూరులో సెప్టెంబర్‌ 10,11 తేదీలలో జరగనుంది. టాలీవుడ్ నుండి బ్లాక్ బస్టర్ మూవీస్ అఖండ 10 , జాతి రత్నాలు 8, ఉప్పెన 8 విభాగాలలో అవార్డ్స్ కు నామినేట్ అయ్యాయి. సైమా అవార్డులకు 12 విభాగాలలో పుష్ప: ది రైజ్ మూవీ నామినేట్ అయ్యింది. సైమా అవార్డులకు అత్యధిక విభాగాలలో నామినేట్ అయిన మూవీ గా పుష్ప: ది రైజ్ రికార్డ్ క్రియేట్ చేసింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 9 =