హను రాఘవపూడి మరోసారి ప్రేమకథలు తీయడంలో ఎక్స్ పర్ట్ అని సీతారామం సినిమాతో నిరూపించాడు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లు గా వచ్చిన సినిమా సీతారామం. ఈసినిమా ఈనెల 5వ తేదీన రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. యుద్ధంతో రాసిన ఈ ప్రేమకథ క్లాసిక్ రొమాంటిక్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర కూడా ఇప్పటికే రూ.50 కోట్లకుపైగా వసూలు చేసి సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. ఈసినిమాను చూసిన సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కూడా ఈ మూవీపై స్పందిస్తూ ప్రశంసలు కురిపించింది. తన ట్విట్టర్ లో వేదికగా ఆమె.. “సీతారామం ఓ అందమైన సినిమా. మిమ్మల్ని మెల్లగా పట్టేసుకొని అలా సీతారామం ప్రయాణంలోకి తీసుకెళ్తుంది. కంగ్రాచ్యూలేషన్స్ సీతా, రామ్, అఫ్రీన్.. ఈ సినిమాలో పని చేసిన ప్రతి మనిషికి, ప్రతి కళకు.. హృదయాన్ని కదిలించింది. ఇలాంటి స్టోరీలన్నింటికీ చీర్స్” అని పోస్ట్ లో పేర్కొంది.
#SitaRamam ❤️ A beautiful film which so gently embraces u and takes u on a journey of Sita ram…Congratulations Sita,Ram,Afreen….EVERY single person out there, every single craft… heartwarming…Cheers to many more heart warming stories 😊@dulQuer @iamRashmika @AshwiniDuttCh pic.twitter.com/276AnwUsI8
— Anushka Shetty (@MsAnushkaShetty) August 18, 2022
కాగా ఈసినిమాను వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ పతాకంపై అశ్విని దత్, ప్రియాంక్ దత్ నిర్మించారు. ఈసినిమాలో ఇంకా ప్రకాష్ రాజ్, సుమంత్, వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, సునీల్, ప్రియదర్శి పలువురు కీలక పాత్రల్లో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈసినిమాకు పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫి అందించారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.