సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు సాలిడ్ సర్ ప్రైజ్ వచ్చింది.. సర్కారు వారి పాట సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మహేష్ ఇంతవరకూ తన కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లలేదు. సినిమా సినిమాకు గ్యాప్ ఇవ్వడం మహేష్ కు అలవాటే. సర్కారు వారి పాట తరువాత కూడా మహేష్ వెకేషన్ వెళ్లాడు. తిరిగి రావడం కూడా అయిపోయింది. కానీ త్రివిక్రమ్ తో చేయబోతున్న సినిమాను ఇంకా స్టార్ట్ చేయలేదు. మరోవైపు ఫ్యాన్స్ మాత్రం మహేష్ కొత్త సినిమాను ఎప్పుడు ప్రారంభిస్తాడా అని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే వారి ఎదురుచూపులకు మంచి ట్రీట్ దొరికింది. ఈసినిమా షూటింగ్ ఇంకా మొదలుకాలేదు కానీ అప్పుడే రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించేశారు. ఈసినిమాను వచ్చే ఏడాది సమ్మర్ రిలీజ్ చేస్తున్నట్టు ఎప్పుడో చెప్పారు. అయితే ఇప్పుడు తాజాగా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేస్తూ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు.ఈసినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 28 వతేదీన రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించేశారు. మరి వచ్చే ఏడాది సమ్మర్ బరిలోకి దిగడానికి ముందుగానే డేట్ ఫిక్స్ చేసుకున్నారు.
The Reigning Superstar will arrive on 28th April 2023! 🔥🤩
Get ready to witness @urstrulymahesh garu in a scintillating Massy look & high octane entertainer ~ #SSMB28 🌟#Trivikram @hegdepooja @MusicThaman @vamsi84
#SSMB28From28April pic.twitter.com/Mux0pWnfan
— Haarika & Hassine Creations (@haarikahassine) August 18, 2022
కాగా ఈసినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తుంది. దీనితో పాటు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ను ఈ నెల నుండే మొదలుపెట్టనన్నట్టు తెలుస్తుంది.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























