75 రోజులు పూర్తి చేసుకున్న “విక్రమ్ “

Vikram Movie Completes 75 Days,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies, Vikram,Vikram Movie,Vikram Telugu Movie,Vikram Pan India Movie,Vikram Movie 75days Completed,Vikram Completes 75days,Vikram Movie Collections, Kamal Haasan,Kamal Haasan Vikram Movie Completes 75days,Vikram Movie Latest News,75days For Vikram Movie,Vikram Blockbuster Movie Completes 75days

రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్”విక్రమ్ ” జూన్ 3వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించాయి.అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. హీరో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్,అతిథి పాత్రలో నటించిన స్టార్ హీరో సూర్య తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.“విక్ర‌మ్” మూవీ ఘనవిజయం సాధించడంతో విమర్శ‌కులతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు కూడా ప్ర‌శంసించిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“విక్రమ్ ” మూవీ ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణతో 400 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. “విక్రమ్ “మూవీ తెలుగు తమిళ హిందీ భాషలతో పాటు కన్నడ, మలయాళ వెర్షన్స్ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ఓటీటీలో జూలై 8వ తేదీ స్ట్రీమింగ్ కాబడింది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం.. ఓటీటీలోనూ సత్తా చాటింది. తాజాగా “విక్రమ్ ” మూవీ 75వ స్వాతంత్య్ర దినోత్స‌వం రోజున థియేట‌ర్ల‌లో స‌క్సెస్ ఫుల్‌గా 75 రోజులు పూర్తి చేసుకొనడం విశేషం. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ రాజ్‌క‌మ‌ల్ ఫిల్మ్స్ ఇంట‌ర్‌నేష‌న‌ల్ సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.