బాలీవుడ్ లో “కార్తికేయ2 ” మూవీ హవా

Karthikeya 2 Movie Gets Superb Collections In Bollywood,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies Karthikeya 2,Karthikeya 2 Movie,Karthikeya 2 Telugu Movie,Karthikeya 2 In Bollywood,Karthikeya 2 movie Response in Bollywood,Karthikeya 2 Huge Response From Bollywood, Karthikeya 2 Movie Latest Box Office Collections,Karthikeya 2 Bollywood Collections Updates,Karthikeya 2 Movie Collections Updates,Karthikeya 2 Opening collections, Nikhil Siddharth Karthikeya 2 Movie Response From Bollywood,Nikhil Siddharth Latest Movie Karthikeya 2

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ “కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన “కార్తికేయ 2 “మూవీ ఆగస్ట్ 13 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.హీరో నిఖిల్ , హీరోయిన్ అనుపమ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “కార్తికేయ 2” మూవీ 3 రోజులలో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఓవర్ సీస్ తో పాటు , నార్త్ లో కూడా ఈ మూవీ అద్భుత రెస్పాన్స్ అందుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నార్త్ లో “కార్తికేయ 2” మూవీ కి క్రేజ్ రోజురోజుకీ పెరుగుతోంది. తొలి రోజు కేవలం 53 షోలతో ప్రారంభమైన ఈ ప్రభంజనం.. రెండో రోజు 181 షోస్ , మూడో రోజు 711 షోలు, నాల్గవ రోజు 1228 షోలు ప్రదర్శించబడగా,  తాజాగా ఐదో రోజు 1575 షోలతో నార్త్ బెల్ట్‌లో “కార్తికేయ 2” సినిమా దూసుకుపోతోంది. నిఖిల్ వంటి టాలీవుడ్‌లో ఓ చిన్న హీరో ఇపుడు బాలీవుడ్ బడా స్టార్స్‌కు తన సినిమాతో చుక్కలు చూపిస్తున్నారు. ప్రస్తుతం నార్త్‌లో “కార్తికేయ 2” సినిమాకు రోజుకు రోజుకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. దీంతో ఆమీర్ “లాల్ సింగ్ చడ్డా’, అక్షయ్ కుమార్‌ల “రక్షా బంధన్” సినిమాలను తీసేసి” కార్తికేయ 2″కు స్క్రీన్స్‌ను పెంచడం విశేషం. “కార్తికేయ 2” మూవీ ముందు ముందు ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేయనుందో వేచి చూడాల్సిందే.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × three =