బ్రహ్మాస్త్ర ఇన్స్పిరేషన్ కు అవే కారణాలు

Ayan Mukherjee Reveals Brahmastra Movie Inspirations,Brahmastra Inspirations: Avengers, Avatar, Lord Shiva and Lord Krishna Are The Inspirations For Brahmastra Movie,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies Brahmastra,Brahmastra Movie,Brahmastra Pan Indain Movie,Brahmastra Inspirations,Inspiration For Brahmastra Movie Lord Shiva and Lord Krishna,Brahmastra Upcoming Movies,Brahmastra Latest Movie Updates, Avatar and Avengers are the Inspirations for Brahmastra Movie,Ranbir Kapoor,Bollywood Star Hero Ranbir Kapoor Upcoming Movie Brahmastra

బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ డ్రీమ్ ప్రాజెక్ట్ బ్రహ్మాస్త్ర సినిమా త్వరలో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే కదా. మూడు భాగాలుగా వస్తున్న ఈసినిమా మొదటిభాగం సెప్టెంబర్9వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు. ముందునుండీ చెబుతున్నట్టే ప్రమోషన్ కార్యక్రమాలు మాత్రం భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా గురించి అయాన్ పలు విషయాలు తెలియచేశాడు. బ్రహ్మాస్త్ర సినిమాకు ఆలోచన ఎక్కడ మొదలైంది.. ఈసినిమాలోని బ్రహ్మాస్త అంటే ఏమిటి.. బ్రహ్మాస్త్రాన్ని కాపాడే మిగిలిన అస్త్రాలు ఏంటి వాటి ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలను వివరించారు. ఇకఇప్పుడు ఈసినిమా తీయడానికి అసలు ఇన్స్పిరేషన్ ఎక్కడినుండి వచ్చిందో తెలియచేశాడు అయాన్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా ఇన్స్పిరేషన్ కు చిన్నప్పటి నుండి మా నాన్నగారు పవర్ ఫుల్ దేవుళ్లు, దేవతల గురించి చెప్పేవారు. నామీద కూడా అవి చాలా ప్రభావం చూపించేవి. ఇంకా హిందూ పురాణాలు, భారతీయ చరిత్ర మరియు బ్లాక్‌బస్టర్ హాలీవుడ్ సినిమాల నుండి కూడా ప్రభావితం చేశాయి అని చెప్పుకొచ్చాడు. ఇంకా వీటితో పాటు బ్రహ్మాస్త్ర సినిమాకు శివుడు ఇంకా విష్ణు కథలు కూడా నన్ను ఇన్ఫ్లూయన్స్ చేశాయని తెలిపాడు.

కాగా సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న  ఈసినిమాలో రణ్‌బీర్‌కపూర్‌ శివ పాత్రలో నటిస్తుండగా అలియా ఇషా పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌ బచ్చన్‌, అలానే నాగర్జున, మౌనిరాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను మూడు పార్టులుగా ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈసినిమాకు ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + three =