గుర్తుందా శీతాకాలం కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

Gurthunda Seethakalam Gets A New Release Date,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies, Gurthunda Seethakalam,Gurthunda Seethakalam Movie,Gurthunda Seethakalam Telugu Movie,Gurthunda Seethakalam Movie Updates,Gurthunda Seethakalam Announced New Movie Release Date, Gurthunda Seethakalam latest Release Date Announced,Satyadev and Tamanna,Hero Satyadev,Satyadev Upcoming Movie Gurthunda Seethakalam Release Date Fixed

చిన్న చిన్న పాత్రలు వేసే స్థాయి నుండి ఇప్పుడు హీరోగా వరుస అవకాశాలతో సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ నటుల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యదేవ్. ఒకపక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరోపక్క పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈయన తమన్నాతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గుర్తుందా శీతాకాలం టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. కన్నడ సూపర్ హిట్ మూవీ లవ్ మాక్ టైల్ సినిమాకు ఈసినిమా రీమేక్. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు నాగశేఖర్ తెరెక్కిస్తుండగా, ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాను ఎప్పటినుండో రిలీజ్ చేయాలి అనుకుంటున్నా కొన్ని కారణాల వల్ల వరుసగా వాయిదా వేస్తూ వచ్చారు. మరోవైపు ఫ్యాన్స్ కూడా ఈసినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫైనల్ గా ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. ఈ మూవీ రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ అధికారికంగా తెలిపింది.

ఇంకా ఈ సినిమాలో మేఘా ఆకాష్, కావ్య‌శెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నాగ శేఖర్ మూవీస్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ సినిమాను నాగశేఖర్, భావన రవి నిర్మిస్తున్నారు. కీరవాణి తనయుడు కాల భైరవ సంగీతాన్ని అందిస్తుండగా.. సత్య హెగ్డే సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 4 =