కంక్లూజన్ తో వచ్చేస్తున్న దృశ్యం 3

Drishyam 3 Movie Latest Update,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies, Drishyam 3,Drishyam 3 Movie,Drishyam 3 Telugu Movie,Drishyam 3 Latest Telugu Movie,Drishyam 3 Latest Updates,Drishyam 3 Upcoming Movie, Drishyam 3 Movie Coming Soon,Drishyam 3 Movie New Updates,Conclusion of Drishyam 3 Movie Coming Soon,Jeethu Joseph,Director Jeethu Joseph Drishyam

ప్రస్తుతం సీక్వెల్స్ హవా కూడా బాగానే నడుస్తుంది. ఒక సినిమా హిట్ అయితే దానికి సీక్వెల్స్ తీయడానికి ఏమాత్రం వెనుకాడట్లేదు. ఇక దీనిలో భాగంగానే దృశ్యం సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటివరకూ దృశ్యం ఇంకా దృశ్యం2 సినిమాలు వచ్చాయి. జీతూజోసఫ్‌ దర్శకత్వంలో మోహన్‌లాల్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ఫ్యామిలీ థ్రిల్లర్ ‘దృశ్యం’ 2013 డిసెంబ‌ర్ 19న విడుద‌లై అప్ప‌ట్లో కేర‌ళ‌లో ఇండ‌స్ట్రీ హిట్ గా నిల‌చింది. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ మొదలైన భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేయగా అన్ని భాషల్లోనూ మంచి విజయం దక్కించుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇటీవలే ఈసినిమా సీక్వెల్ గా దృశ్యం 2 సినిమా కూడా తీయగా అది కూడా హిట్ అయింది. తెలుగులో కూడా దృశ్యం2 రిలీజ్ అయింది. ఇక్కడ కూడా హిట్ అయింది. ఇప్పుడు దృశ్యం3 సినిమాను కూడా ప్లాన్ చేస్తున్న సంగతి విదితమే. ఈ మూడో పార్ట్ గురించి అప్పట్లో జీతూ జోసఫ్ కూడా మాట్లాడుతూ.. దృశ్యం 3 స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నాను.. క్లైమాక్స్ కూడా రాసుకున్నానని చెప్పారు. అయితే ఈసినిమా ఎప్పుడు మొదలవుతుంది.. అసలు ఉందా లేదా అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి. ఇప్పుడు వాటికి క్లారిటీ వచ్చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి మోహన్ లాల్ పోస్టర్ ను వదిలారు. ది కంక్లూజన్ పేరుతో ఈసీక్వెల్ రానుంది. ఇక మోహన్ లాల్ కి సంకెళ్లు వేసి ఉండటం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మరి ఇది కంక్లూజన్.. అందులోనూ రెండు సినిమాలు హిట్ అయ్యాయి కాబట్టి రెండు పార్ట్ లకంటే ఇంకా ఆసక్తికరంగా ఈ సీక్వెల్ ను తెరకెక్కించాలి. చూద్దాం ఈసినిమాలో జీతూ ఎన్ని ట్విస్టులు ఉంటాయో..

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − nine =