ఆనంద్ దేవరకొండ హైవే ట్రైలర్ రిలీజ్

Anand Deverakondas Highway Trailer Released,Telugu Film News 2022,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies Highway,Highway Movie,Highway Telugu Movie,Highway movie Trailer,Highway Trailer Released,Highway Movie Trailer Released, Anand Deverakonda,Hero Anand Deverakonda,Anand Deverakonda upcoming movie Highway,Anand Deverakonda Upcoming movie Highway Trailer Released, Highway Telugu Movie Trailer Out Now

టాలీవుడ్ లో రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు విజయ్ దేవరకొండ. ఇక విజయ్ దేవరకొండ తమ్ముడిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు ఆనంద్ దేవరకొండ. దొరసాని సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ ఆ తరువాత మిడిల్‌క్లాస్‌ మెలోడీస్‌, పుష్పక విమానంలాంటి మూవీస్‌తో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మరో క్రైమ్‌ థ్రిల్లర్‌తో ఆడియెన్స్‌ను థ్రిల్‌ చేయడానికి వస్తున్నాడు. సినిమాటోగ్రాఫ‌ర్ కేవీ గుహ‌న్ ద‌ర్శక‌త్వంలో తెరకెక్కుతున్న సైకో క్రైమ్‌ థ్రిల్లర్ ‘హైవే’. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. నాగశౌర్య సోషల్‌ మీడియాలో ట్రైలర్ రిలీజ్‌ చేశాడు. ఇక ట్రైలర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటుంది. హిందీలో వచ్చిన పాతాళ్‌ లోక్‌ వెబ్‌ సిరీస్‌ ఫేమ్‌ అభిషేక్ బెనర్జీ ఇందులో సైకో కిల్లర్‌గా కనిపిస్తున్నాడు. అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించే విష్ణు క్యారెక్టర్‌లో ఆనంద్‌ కనిపించనున్నాడు. ట్రైలర్ అయితే సినిమాపై ఆసక్తిని పెంచుతుంది.

కాగా ఈసినిమాలో మానస రాధాకృష్ణన్‌ హీరోయిన్‌గా న‌టిస్తోంది. నిర్మాత‌ వెంకట్‌ తలారి శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.2గా ‘హైవే’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈసినిమాలో నటించే నటీనటుల వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంపై భారీగా అంచ‌నాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏస్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ హైవే ఆగస్ట్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × three =