వైరల్ గా మహేష్ న్యూ లుక్

Mahesh Babus New Look Goes Viral,Mahesh Babu’s Makeover For SSMB28: Pictures Of His New Look Have Been Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Mahesh Babu,Super Star Mahesh Babu,Mahesh Babu Makeover,Mahesh Babu Makeover For SSMB28 Movie,Mahesh Babu New Pictures Released,Mahesh Babu Latest Makeover Pictures Released,Mahesh Babu Makeover Picture From SSMB28 Movie Released,Mahesh Babu New Look From SSMB28 Movie Released,Mahesh Babu New Look Pictures Goes Viral in Social Media

టాలీవుడ్ రాకుమారుడు ఎవరంటే వెంటనే చెప్పే పేరు సూపర్ స్టార్ మహేష్ బాబు. రోజు రోజుకూ మహేష్ వయసు తగ్గిపోతుందా అన్నట్టు యంగ్ గా తయారవుతున్నాడు. ప్రస్తుతం మహేష్ తన ఫ్రీ టైమ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. సర్కారు వారి పాట సూపర్ హిట్ అవ్వడంతో మహేష్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ గ్యాప్ లో ఫ్యామిలీ ట్రిప్స్ కూడా వేసేసి ఎంజాయ్ చేశాడు. ఇక ట్రిప్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోస్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాద్వారా పంచుకుంటూనే ఉన్నారు. ఇక మహేష్ లుక్ కు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక తాజాగా మహేష్ కు సంబంధించిన న్యూ లుక్ వైరల్ అవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లాయిడ్ స్టీవెన్స్ ఫిట్ నెస్ ట్రైనర్ గురించి తెలిసిందే కదా. హాలీవుడ్ నుండి మన టాలీవుడ్, బాలీవుడ్ లో కూడా చాలామందికి ఫిట్ నెస్ ట్రైనర్ గా చేశారు. గతంలో తారక్ కు కూడా ఫిట్నెస్ కోచ్ గా చేశారు. అయితే తాజాగా లాయిడ్ స్టీవెన్స్ మహేష్ బాబు తో దిగిన ఫోటో తన సోషలో మీడియా ఖాతా ద్వారా పంచుకున్నారు. దీంతో లాయిడ్ స్టీవెన్స్ కూడా మహేష్ కు ట్రైనింగ్ ఇస్తున్నట్టు అర్థమవుతుంది. ఇక ఇందులో మహేష్ యంగ్ లుక్ లో ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం అయితే ఈలుక్ వైరల్ అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Lloyd Stevens (@lloydstevenspt)

కాగా తన తరువాత సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చేయనున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈసినిమా షూటింగ్ ను కూడా స్టార్ట్ చేయనున్నాడు మహేష్. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈసినిమాపై ఇప్పటినుండే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమాలో మహేష్ బాబు సరసన మరోసారి పూజా హెగ్డే నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు మధి కెమెరామెన్‌గా వ్యవహరించబోతోన్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 5 =