పోల్ గేమ్ : చిత్రీకరణ జరుపుకుంటున్న ఏ మూవీకి మీ ఓటు ?

For Which Upcoming Among These upcoming releases you are more excited?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Hari Hara Veera Mallu,Pawan Kalyan,Power Star Pawan Kalyan,Pawan Kalyan Upcoming Movie Hari Hara Veera Mallu Shooting Updates,Hari Hara Veera Mallu Latest Movie Updates,Salaar,Salaar Pan Indian Movie,Prabhas,Pan Indian Star Prabhas,Pan Indian Star Prabhas Upcoming Movie Salaar,Salaar Movie Shooting Updates,Prabhas Upcoming Movie Salaar Latest Shooting Updates,RC15 Movie,RC15 Telugu Movie,Ram Charan,Ram Charan Upcoming Movie RC15,RC15 Latest Shooting Updates,RC15 Movie Shooting Updates,Samantha,Actress Samantha Upocming Movie Kushi,Kushi Movie Updates,Kushi Movie Latest Shooting Updates,Vijay Deverakonda and Samantha Upcoming Movie Kuhsi Shooting Updates,Most Awaited Movies From Tollywood

హరిహర వీరమల్లు : మెగా సూర్య ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల కాలం నేప‌థ్యంలో భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్, పాన్ ఇండియా “హరి హర వీరమల్లు ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో నిధి అగర్వాల్ , నర్గీస్ ఫక్రి కథానాయికలు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.సీనియర్ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి రూపొందించిన భారీ సెట్స్ లో హీరో పవన్ కళ్యాణ్ పై భారీ యాక్షన్ సీన్స్ ను దర్శకుడు తెరకెక్కించారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న “హరి హర వీరమల్లు” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సలార్ : హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 “మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు , కన్నడ భాషలలో యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.“సలార్” మూవీ డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతుంది. భారత చలన చిత్ర పరిశ్రమలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న మొదటి చిత్రం “సలార్”. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఒక కీలక పాత్ర లో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2” మూవీస్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన పాన్ ఇండియా స్టార్ యష్ “సలార్” మూవీ లో అతిథి పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.

RC15 : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో“#RC15” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ లో అంజలి , జయరామ్ , శ్రీకాంత్ , సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు .”#RC15” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. #RC15 ” మూవీ హైదరాబాద్‌, పూణె, రాజమండ్రి , అమృత్ సర్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే. 1200 ఫైటర్స్ తో హీరో రామ్ చరణ్ పాల్గొనే యాక్షన్ సీన్ , 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు, డాన్సర్ లతో రామ్ చరణ్ , కియారా అద్వానీ పాల్గొనే సాంగ్ #RC15” మూవీకి హైలైట్ కానున్నాయి.

ఖుషి: మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై కుటుంబ కథా చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ , సమంత జంటగా భారీ బడ్జెట్ తో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “ఖుషి”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో సచిన్ ఖేద్కర్ , మురళీశర్మ , లక్ష్మి ,అలీ , రోహిణి , వెన్నెల కిషోర్ , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హేషం అబ్దుల్ వాహెబ్ సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్ కశ్మీర్ లో కంప్లీట్ చేసుకున్న “ఖుషి” మూవీ మరో షెడ్యూల్ ను వైజాగ్‌లో జరిగింది.వైజాగ్ షెడ్యూల్‌లో సమంత, విజయ్ దేవరకొండలపై ఓ రొమాంటిక్ సాంగ్‌తో పాటు కీలక సన్నివేశాలను దర్శకుడు శివ తెరకెక్కించారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండపై సోలో సాంగ్ చిత్రీకరణ జరుగుతుందని సమాచారం.

పోల్ గేమ్ : చిత్రీకరణ జరుపుకుంటున్న ఏ మూవీకి మీ ఓటు ?

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + nine =