తెలుగు సినీ పరిశ్రమలో అప్పుడప్పుడు క్రేజీ కాంబినేషన్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు అలాంటి క్రేజీ కాంబినేషన్ లోనే ఒక సినిమా రాబోతుంది. ఆ కాంబినేషన్ ఎవరిదో కాదు బాలకృష్ణ-అనిల్ రావిపూడిది. గత ఏడాది బాలకృష్ణ బోయపాటి శ్రీనుతో అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి సూపర్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు. రీసెంట్ గానే అనిల్ కూడా ఎఫ్3 తో తన హిట్స్ లిస్ట్ లో మరో హిట్ ను చేర్చుకున్నాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. ఇప్పటికే ఈసినిమా గురించి ఎన్నో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక అనిల్ కూడా బాలయ్య కోసం ఒక సాలిడ్ కథనే సిద్దం చేస్తున్నట్టు చెప్పాడు. ప్రస్తుతం అయితే ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే తాజాగా ఈసినిమాపై అధికారిక ప్రకటన ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ అనౌన్స్ మెంట్ వీడియోని వదిలారు. ఇక ఈసినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఈ చిత్రానికి స్టార్ కంపోజర్ ఎస్ థమన్ సంగీతం అందించనున్నట్టు తెలిపారు.“త్వరలో బాంబార్డింగ్…” అంటూ ఈ ప్రాజెక్ట్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని మేకర్స్ ప్రకటించారు.
#NBK108 Announcement🔥💥
The Magnanimous Combination of the Ferocious 𝐋𝐈𝐎𝐍 🦁#NandamuriBalaKrishna & the Blockbuster 𝐇𝐢𝐭 𝐌𝐚𝐜𝐡𝐢𝐧𝐞 @AnilRavipudi ❤️🔥
Will be Marching with @sahugarapati7 @harish_peddi @MusicThaman to Create Mayhem🤙💫 pic.twitter.com/poz7W5zKzh
— Shine Screens (@Shine_Screens) August 11, 2022
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: