‘పవన్’ స్టార్ట్.. కెమెరా.. యాక్షన్..!

Hari Hara Veera Mallu Movie New Schedule Update,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest News,Tollywood Movie Updates,Tollywood Movie Releases This Week,Telugu Movie Releases This Weekend,Hari Hara Veera Mallu Movie,Hari Hara Veera Mallu Telugu Movie, Hari Hara Veera Mallu Movie Latest Updates,Hari Hara Veera Mallu Pawan Kalyan Movie,Pawan Kalyan Upcoming Movie Hari Hara Veera Mallu,Hari Hara Veera Mallu New Movie Schedule Latest Updates,Hari Hara Veera Mallu Schedule Updates,Power Star Pawan Kalyan Next Project Updates,Krish Jagarlamudi,Director Krish Jagarlamudi,Pawan Kalyan with Director Krish Jagarlamudi Upcoming Movie Hari Hara Veera Mallu,Nidhhi Agerwal,Actress Nidhhi Agerwal, Nidhhi Agerwal With Pawan Kalyan in Hari Hara Veera Mallu

ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. మొఘ‌లాయిల కాలం నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఫ్యాన్స్ కూడా ఈసినిమా కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. పవన్ మొదటిసారి ఇలాంటి పాత్రలో నటిస్తుండటంతో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈసినిమా మాత్రం లేట్ అవుతూ వస్తూనే ఉంది. వకీల్ సాబ్ కన్నా ముందు ఈసినిమాను మొదలుపెట్టినా కూాడా ఈసినిమా ఇంతవరకూ షూటింగ్ నే పూర్తి చేసుకోలేదు. ఇక ఈమధ్య మళ్లీ షూటింగ్ ను మొదలుపెట్టినా పవన్ మళ్లీ రాజకీయాలతో బిజీ అవ్వడంతో షూట్ కు బ్రేక్ పడింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజా సమాచారం ప్రకారం పవన్ మళ్లీ కెమెరా ముందుకు రావడానికి రెడీ అయినట్టు తెలుస్తుంది.
ఇక ఈసినిమా కొత్త షెడ్యూలన్ స్టార్ట్ చేసి పెండింగ్ లో ఉన్న షూటింగ్ ను మొత్తం కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాడట పవన్. ఆగష్ట్ 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అనంతరం ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది.

కాగా ఈసినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జోడీగా నిధి అగ‌ర్వాల్ నటిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ న‌ర్గీస్ ఫ‌క్రీ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ఇంకా అర్జున్‌ రాంపాల్‌ కూడా ఓ కీలక పాత్రల్లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తన మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ప్రముఖ సంగీత ద‌ర్శకుడు యం.యం.కీర‌వాణి సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫ‌ర్ జ్ఞాన ‌శేఖ‌ర్ వి.ఎస్‌. సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =