మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తే ఆ సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని మరోసారి నిరూపించారు. ప్రస్తుతం టాలీవుడ్ పలు సమస్యలను ఎదుర్కొంటుంది. కొన్ని సినిమాలు పాన్ ఇండియా మార్కెట్ వద్ద తమ సత్తా చూపిస్తున్నా కూడా ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలు దాదాపు బాక్సాఫీస్ వద్ద నిరాశనే మిగిల్చాయి. ఇలాంటి టైమ్ లో నిన్న రిలీజ్ అయిన సీతారామం, బింబిసార సినిమాలు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. అందుకే సినీ సెలబ్రిటీలు అందరూ ఈసినిమా విజయాలపై స్పందిస్తూ అభినందనలు తెలియచేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్.. సీతారామం సినిమాతో మరింత దగ్గరయ్యాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా.. భారీ అంచనాల నడుమ నిన్న రిలీజ్ అయి ఫస్ట్ షో నుండే హిట్ టాక్‌ను సంపాదించుకుంది. క్లాసిక్ లవ్ స్టోరీ అంటూ ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈసినిమా కూడా సాలిడ్ కలెక్షన్స్ ను రాబడుతుంది. మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా ఈసినిమా 5కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.
ఇక ఓవర్సీస్ లో కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను యూఎస్ లో రాధాకృష్ణ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ వారు రిలీజ్ చేశారు. ఇక ఈసినిమా అక్కడ 200కే డాలర్స్ పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక ఈసినిమాకు మంచి టాక్ వస్తుంది కాబట్టి ముందు ముందు మరింత కలెక్షన్స్ ను రాబడుతుందన్న నమ్మకంతో ఉన్నారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: