ప్రేక్షకులు మరోసారి నిరూపించారు..!

Chiranjeevi is all praises for Sita Ramam And Bimbisara,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sita Ramam And Bimbisara,Sita Ramam And Bimbisara Movies,Chiranjeevi,Mega Star Chiranjeevi,Mega Star Chiranjeevi Praises Sita Ramam and Bhimbisara Movie Released This Weekend, Chiranjeevi Praises Kalyan Ram Bimbisara Movie,Chiranjeevi Praises Sita Ramam Movie,Chiranjeevi Praises Kalyan Ram,Chiranjeevi Praises Dulquer Salmaan,Bhimbisara and Sita Ramam Movie Box Office Collections

కరోనా తరువాత ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక కరోనా తరువాత ప్రేక్షకులు థియేటర్లకు రావడం కూడా చాలా కష్టంగా మారిపోయింది. సినీ లవర్స్, ఫ్యాన్స్ మాత్రం ఎలా ఉన్నా వస్తారు కానీ కామన్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ రావడం మాత్రం చాలా కష్టంగా మారిపోయింది. ఏదో కొన్ని సినిమాలకు మాత్రమే రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దానికి తోడు ఈ మధ్య వచ్చిన సినిమాలు కూడా ఏవీ అంతగా ఆడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నిన్న రిలీజ్ అయిన రెండు సినిమాలు కాస్త ఊరటనిచ్చాయి. కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన బింబిసార, దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన సీతారామం సినిమాలు ఎన్నోఅంచనాల మధ్య రిలీజ్ అయ్యాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈరెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని దూసుకుపోతున్నాయి. ఇప్పటికే ఈసినిమాపై పలువురు సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు మెగాస్టార్ చిరు కూడా తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ రెండు సినిమాలను అభినందించారు. బింబిసార టీమ్ కు, సీతారామం టీమ్ కు హృదయపూర్వక అభినందనలు.. ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదని బాధపడుతున్న ఇండస్ట్రీకి ఊరటనీ మరింత ఉత్సాహాన్ని ఇస్తూ కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారని ప్రేక్షకులు మరోసారి నిరూపిస్తూ నిన్న రిలీజ్ అయిన రెండు సినిమాలు విజయం సాధించడం ఎంతో సంతోషకరం. ఈ సందర్భంగా బింబిసార, సీతారామం చిత్రాల నటీనటులకు, నిర్మాతలకు, సాంకేతిక నిపుణులందరికీ నా మనఃపూర్వక శుభాకాంక్షలు అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here