“లైగర్” మూవీ నుండి “ఆఫ‌ట్”సాంగ్ రిలీజ్

Aafat Song from Liger Movie Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Liger,Liger Movie,Liger Telugu Movie,Liger Movie Latest Updates,Liger Movie songs,Liger Movie latest Song Updates,liger Movie New Song Released,Liger Movie Song Out Now, Liger Movie latest Song Updates,Vijay Deverakonda,Vijay Deverakonda upcoming Movie Liger,Vijay Deverakonda Upcoming Movie Liger Song Released Updates, Vijay Deverakonda Movie Latest Updates,Vijay Deverakonda Next Project,Vijay Deverakonda Look From Liger Movie,Puri Jagannadh and Vijay Deverakonda Upcoming Movie Liger, Puri Jagannadh,Director Puri Jagannadh,Puri Jagannadh latest Movie Liger,Aafat the new song from Liger,Aafat Song From Liger Movie,Aafat Song Released From Liger Movie, Vijay Deverakonda Aafat Song Released From Liger Movie,Liger Movie Releasing on August 25th

పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ “లైగర్” ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ , మకరంద దేశ్ పాండే , రమ్యకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. తనీష్ బాగ్చి సంగీతం అందించగా , మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ మూవీ కై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు.”లైగర్” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు, వీడియోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.“లైగర్” మూవీ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానుంది.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ సింగిల్ , ట్రైలర్ , యాటిట్యూడ్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భారీ అంచనాలతో రిలీజ్ కానున్న “లైగర్” మూవీ ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ భారీగా చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా చిత్ర యూనిట్ ‘ఆఫ‌ట్’ అంటూ సాగే రొమాంటిక్ సాంగ్‌ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తనీష్ బాగ్చి స్వరకల్పనలో భాస్క‌రభ‌ట్ల ర‌చించిన, సింహా, శ్రావ‌ణ భార్గవి ఆలపించిన ఈ సాంగ్ లో విజ‌య్, అనన్య డ్యాన్స్ స్టెప్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ నుండి సినిమా వ‌చ్చి రెండేళ్ళు దాటింది. “వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్” త‌ర్వాత ఇప్ప‌టివ‌ర‌కు ఈయ‌న నుండి మ‌రో సినిమా రాలేదు. ప్ర‌స్తుతం ఈయ‌న న‌టించిన “లైగ‌ర్‌” మూవీ కోసం అభిమానులు ఎంత గానో ఎదురు చూస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × two =