శివ కార్తికేయన్ కు జోడీగా శంకర్ కూతురు..!

Sivakarthikeyan To Work With Director Shankar Daughter?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sivakarthikeyan,Hero Sivakarthikeyan,Sivakarthikeyan Latest Movie Updates,Sivakarthikeyan Upcoming movies,Sivakarthikeyan new Movie Updates,Sivakarthikeyan Latest Movie News, Sivakarthikeyan To work With Director Shankar Daughter,Shankar Daughter,Aditi Shankar,Actress Aditi Shankar,Shankar Daughter Aditi Shankar To Act with Sivakarthikeyan, Aditi Shankar Upcoming Movie With Sivakarthikeyan

చిన్న చిన్న పాత్రల ద్వారా సినీ ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు తమిళ్ నటుడు శివ కార్తికేయన్. తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా శివ కార్తికేయన్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక ఇటీవలే డాక్టర్, డాన్ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న శివ కార్తికేయన్ ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం అయితే పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. అందులో మడోన్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కూడా ఒకటి. ఇటీవలే ఈసినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు. మావిరన్ అనే టైటిల్ ను తమిళ్ కు ఫిక్స్ చేయగా.. మహావీరుడు అనే టైటిల్ ను తెలుగు కోసం ఫిక్స్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమాలో నటిస్తున్న హీరోయిన్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు మేకర్స్. ఈసినిమాలో శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్ గా నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే అదితి విరుమన్ అనే సినిమాద్వారా ఎంట్రీ ఇవ్వనుంది. ఈసినిమా ఆగష్ట్ 12న రిలీజ్ కానుంది.

కాగా శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భరత్ శంకర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియచేయనున్నారు. త్వరలో ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించనున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + two =