మూడు రోజుల లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన “విక్రాంత్ రోణ”

Sudeep’s Vikrant Rona Movie Break Even Done, Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Telugu Movie Updates, Telugu Filmnagar, Vikrant Rona Movie, Sudeep, Kiccha Sudeep Vikrant Rona to Break Even Done, Vikrant Rona Movie, Vikrant Rona Movie Latest News, Vikrant Rona Telugu Movie, Vikrant Rona Box Office Collection, Vikrant Rona First day box office collections, Vikrant Rona Box office Prediction, Kichcha Sudeep Vikrant Rona, Sudeep Vikrant Rona, Vikrant Rona, Kannada superstar Kiccha Sudeep, Vikrant Rona 100 Crore Box Office Club, Vikrant Rona Worldwide Collection

కిచ్చా క్రియేషన్స్ , షాలిని ఆర్ట్స్ , ఇన్వెనియో ఫిల్మ్స్ ఇండియా బ్యానర్స్ పై అనూప్ భండారి దర్శకత్వంలో సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ ” విక్రాంత్ రోణ”కన్నడ మూవీ జులై 28 వ తేదీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ వచ్చినా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. నీతా అశోక్ , జాక్వెలెన్ ఫెర్నాండెజ్ కథానాయికలు. నిరూప్ భండారి, రవిశంకర్ గౌడ ముఖ్య పాత్రలలో నటించారు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు.హీరో సుదీప్ తన పాత్రకు తగ్గట్లు లుక్స్ అండ్ నటన పరంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్ లో సుదీప్ నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఫాంట‌సీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ” విక్రాంత్ రోణ” మూవీ మూడు రోజులలో 50 కోట్ల క్లబ్ లో చేరడం విశేషం. హీరో సుదీప్ కెరీర్‌లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్‌ను రాబట్టిన ఈ మూవీ ఈ ఏడాది అత్య‌ధిక ఓపెనింగ్స్ వ‌చ్చిన టాప్-5 సౌత్‌ సినిమాల‌లో ఒకటిగా నిలిచింది. తాజాగా ఈ చిత్రం తెలుగులో బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకుంది. “విక్రాంత్ రోణ” చిత్రానికి తెలుగులో కోటిన్న‌ర వ‌ర‌కు థియేట్రిక‌ల్ బిజినెస్ జ‌రిగింది. మూడు రోజులు పూర్త‌య్యే సరికి ఈ చిత్రం రూ.1.91 కోట్ల షేర్‌ను సాధించి సూప‌ర్ హిట్‌గా నిలిచింది. పోటీగా తెలుగు స్ట్రైయిట్ సినిమా ఉన్నా ఈ చిత్రం కేవ‌లం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొనడం విశేషం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.