రష్మిక పై మృణాల్ ఠాకూర్ ప్రశంసలు

Mrunal Thakur Praises Rashmika Mandanna, Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Telugu Movie Updates, Mrunal Thakur, Rashmika Mandanna, Mrunal Thakur About Rashmika Mandanna, Dulquer Salmaan, Sita Ramam, Sita Ramam Movie, Sita Ramam Movie Latest News, Sita Ramam Movie Story, Mrunal Thakur Sita Ramam, Mrunal Thakur Latest News, Mrunal Thakur Movies, Rashmika Mandanna Movies, Rashmika Mandanna Upcoming Movie, Sita Ramam Telugu Movie

వైజయంతీ మూవీస్ స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన “సీతారామం ” మూవీ ఆగస్ట్ 5 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “సీతారామం” మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో గ్రాండ్‌గా విడుద‌ల కానుంది.”సీతారామం” మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“సీతారామం ” మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మృణాల్ ఠాకూర్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ … “కుంకుమ భాగ్య” సీరియల్ ద్వారా తాను అందరికీ తెలిశాననీ , ఆ సీరియల్ తనకు మంచి పేరు తెచ్చిపెట్టిందనీ , తెలుగు నుంచి .. అందునా ఇంతమంచి ప్రాజెక్టు నుంచి తనకు ఛాన్స్ వస్తుందని అనుకోలేదనీ , . అందునా టైటిల్ తో ముడిపడిన రోల్ చేస్తానని అస్సలు ఊహించలేదనీ , దుల్కర్ వంటి స్టార్ హీరో కు జోడీగా తెరపై కనిపించడం అదృష్టంగా భావిస్తున్నాననీ , రష్మిక గురించి మాట్లాడుతూ .. ”సీతారామం” మూవీలో రష్మిక పాత్రకి కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుందనీ , ఎప్పుడు చూసినా రష్మిక చాలా యాక్టివ్ గా ఉంటుందనీ , .చెన్నై .. ముంబై .. బెంగుళూర్ .. ఫారిన్ కి ఆమె విమానాల్లో తిరుగుతూ, వరుస సినిమాలు చేయడం చూస్తే తనకు చాలా ఆశ్చర్యంగా అనిపించేదనీ , తన విషయంలో తాను ఎంత కేర్ తీసుకుంటుందో .. మిగతావారి విషయంలోను అంతే కేర్ తీసుకుంటుందనీ రష్మిక పై మృణాల్ ప్రశంసలు కురిపించారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 10 =