టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నాడు నాగచైతన్య. ఎప్పుడూ కమర్షియల్ సినిమాలే కాదు.. పాత్ర ప్రధానమైన సినిమాలు చేయడానికి కూడా నాగచైతన్య ఎప్పుడూ ముందుంటాడు. అందుకే వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇక నాగచైతన్య లాల్ సింగ్ చద్దా సినిమాతో బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. నాగ చైతన్య కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా హాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఫారెస్ట్ గంప్ సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా ఆగష్ట్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈనేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య తన రోల్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు. ఈసినిమాలో తను ఆంధ్రప్రదేశ్ లోని బోడిపాలెం గ్రామంలోని బాలరాజు అనే పాత్రలో నటిస్తున్నట్టు తెలిపాడు. ముందు ఈ పాత్రకు బాలకృష్ణ, బలరాం అనే పేర్లు పెడదామని అనుకున్నారు మేకర్స్ ఫైనల్ గా బాలరాజు అనే పేరుకు ఫిక్స్ అయ్యారు. ఈ పేరు సెలక్ట్ చేసినందుకు నేను కూడా చాలా ఎగ్జైట్ అయ్యాను.. మా తాతగారు బాలరాజు అనే టైటిల్ తోనే సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు అని తెలిపాడు. ఇక మరోవైపు డైరెక్టర్ అద్వైత్ చందన్ నాగ చైతన్య గురించి చెబుతూ ఈసినిమా కోసం నాగచైతన్య ముందుగానే బాగా ప్రిపేర్ అయ్యాడని.. తను నటిస్తున్నప్పుడు కానీ.. డబ్బింగ్ చెబుతున్నప్పుడు కానీ అందరూ షాకయ్యారు అంటూ చైతు పై ప్రశంసలు కురిపించాడు.
కాగా ఈసినిమాను వయాకామ్ 18 స్టూడియోస్ సంస్థలు రూపొందిస్తున్నాయి. కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నఈసినిమాలో మోనా సింగ్, యోగి బాబు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఆగష్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఈసినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్న సంగతి తెలిసిందే కదా. చిరు కూడా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ సినిమాకు సపోర్ట్ చేస్తున్నారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: