బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో బ్రహ్మాస్త్ర ఒకటి. ఈసినిమా భారతీయ పురాతన అస్త్రాల నేపథ్యంలో తెరకెక్కించాడు అయాన్ ముఖర్జీ. ఈసినిమాలో రణ్‌బీర్‌కపూర్, అలియా భట్ జంటగా నటించారు. తెలుగులో ఈసినిమాను బ్రహ్మాస్త్రం పేరుతో రిలీజ్ చేయనున్నారు. మూడు భాగాలుగా వస్తున్న ఈసినిమా మొదటి పార్ట్ ను సెప్టెంబర్ 9న విడుదలకానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు కానీ, గ్లింప్స్, ట్రైలర్ అన్నీ సినిమాపై అంచనాలు పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా కొత్తగా ప్లాన్ చేస్తుంది చిత్రయూనిట్. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతుంది కాబట్టి అన్ని ప్రాంతాల్లో ఖచ్చితంగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రెస్ మీట్లు ఇస్తారు.. ఇంటర్వ్యూల్లో పాల్గొంటారు. కానీ ఇలాంటి క్రియేటివ్ డిఫరెంట్ సినిమాలు ఇంకా జనాల్లోకి వెళ్లాలంటే అందుకు తగ్గట్టుగానే ప్రమోషన్స్ కూడా కొత్తగా ఉండాలి. ఇప్పుడు బ్రహ్మాస్త్ర టీమ్ అదే పనిలో ఉంది. దీనిలో భాగంగానే తాజాాగా ఈసినిమాలోని అస్త్రాలను బేస్ చేసుకొని ఇన్ట్సా ఫిల్టర్ ను క్రియేట్ చేశారు. జలాస్త్ర, పవనాస్త్రా, ప్రభాస్త్రా, ఆగ్నాస్త్ర, వానరాస్త్ర ఇంకా నంది అస్త్రాలతో ఫిల్టర్ ను యాడ్ చేసి ఈ అస్త్రాలలో మీరు ఏ అస్త్రానికి చెందినవారు అంటూ పేర్కొన్నారు. ఇక ఈ ఫిల్టర్ ప్రకారం యూజర్స్ తాము ఏ అస్త్రాన్ని సెలక్ట్ చేసుకుంటే అది బ్యాక్ గ్రౌండ్ గా మారుతుంది. ఇక ఇప్పటికే అభిమానులు వాటిని ట్రై చేసి తమ తమ రీళ్లను షేర్ చేసుకుంటున్నారు. ఈ ఫిల్టర్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్‌గా మారింది.
కాగా సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈసినిమాలో రణ్‌బీర్‌కపూర్ శివ పాత్రలో నటిస్తుండగా అలియా ఇషా పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, అలానే నాగర్జున, మౌనిరాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను మూడు పార్టులుగా ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈసినిమాకు ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































