క్రాక్ తర్వాత ఖిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజకు ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. అయినా కూడా రవితేజ ఎలాంటి నిరాశ చెందకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అంతేకాదు అదే ఫాస్ట్ గా సినిమాలు కంప్లీట్ చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తను రిలీజ్ కు సిద్దం చేసిన సినిమా రామారావు ఆన్ డ్యూటీ. ఈసినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను ఎప్పుడో మొదలుపెట్టి ఇప్పటికే టీజర్, ట్రైలర్ పాటలు రిలీజ్ చేయగా అన్నీ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. రీసెంట్ గానే రామారావు మాస్ నోట్ అంటూ మరో వీడియోను రిలీజ్ చేయగా ట్రైలర్ ను మించి ఉండటంతో సినిమాపై ఇంకా అంచనాలు పెరిగాయి. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. ఈసినిమాకు యూఏ సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ బృందం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Ultimate Action thriller coming your way 🔥#RamaRaoOnDuty In Cinemas JULY 29 💥
Book your Tickets Now.
– https://t.co/4UYjsl43jy@RaviTeja_offl @directorsarat @Divyanshaaaaaa @rajisha_vijayan @SamCSmusic @sathyaDP @SLVCinemasOffl @LahariMusic pic.twitter.com/FTDrWvJdta— RT Team Works ON DUTY (@RTTeamWorks) July 27, 2022
కాగా ఈసినిమాలో దివ్యాంశ కౌశిక్, రజిష విజయన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. వేణు తొట్టెంపూడి, నాజర్, తనికెళ్లభరణి, పవిత్ర లోకేష్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్, ఆర్‌టీ టీం వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈసినిమాకు శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























