మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్‌లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. లెజెండరీ డైరెక్టర్, స్టార్ హీరో రామ్ చరణ్కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి మొదటి నుండీ భారీ ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి. ఇక ఆ అంచనాలకు ఎక్కడా తగ్గకుండా శంకర్ కూడా ఆదే స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈసినిమా గురించి ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంది. ఇటీవలే ఈసినిమాలో నటీనటుల ఎంపిక జరుగుతోంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. ఇక ఈవార్తలు కాస్త చిత్రయూనిట్ వరకూ వెళ్లడంతో చిత్రనిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది. ఈసినిమాలో పలానా నటీనటులు నటిస్తున్నారన్న వార్తల్లో కానీ.. నటీనటుల ఎంపిక జరుగుతోంది అంటూ వస్తున్న వార్తల్లో కానీ నిజం లేదని తెలిపారు. తమ ప్రాజెక్ట్‌లో ఎవరినైనా నటీనటులుగా ఎంపిక చేసే బాధ్యత, అధికారం ఏ వ్యక్తికి, సంస్థకు లేదని ఆ రూమర్లను ఖండించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
A note of caution to everyone #RC15 #SVC50 pic.twitter.com/KRPiykeCk2
— Sri Venkateswara Creations (@SVC_official) July 24, 2022
కాగా కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































