‘రామారావు ఆన్ డ్యూటీ’ టైటిల్ సాంగ్ రిలీజ్

King of The Crowd Song is Out From Ramarao On Duty,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ramarao On Duty,Ramarao On Duty Movie,Ramarao On Duty Movie Latest Updates,Ramarao On Duty Movie Song,King of the Crowd Song Out Now, King of the Crow Song is Released From Ramarao on Duty Movie,Ramarao on Duty King of the Crowd Song Released,Mass MahaRaja Ravi Teja,Ravi Teja,Ravi Teja Ramarao on Duty Movie Updates, Ravi Teja King of The Crowd Song Released From Ramarao on Duty Movie,Ravi Teja King of the Crowd Song Released,Ravi Teja upcoming Movies,Ravi Teja New Movie Update,Ravi Teja New Movie Updates

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోల్లో మాస్ మహారాజా రవితేజ కూడా ఒకరు. అందుకే రవితేజ కు తెలుగు ప్రేక్షకుల్లో ఎప్పుడూ సాప్ట్ కార్నర్ ఉంటుంది. ఇక తన సినిమాలతో రవితేజ మాస్ ఫాలోయింగ్ ను కూడా సొంతం చేసుకున్నాడు. ఇక ఈఏడాది ఖిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు రెడీ చేశాడు. శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ. జులై 29న రిలీజ్ అవుతుండటంతో.. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ కార్యక్రమాలలో స్పీడు పెంచింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి వరుసగా పాటలు, టీజర్, ట్రైలర్ కూడా రిలీజ్ అయిపోయాయి. అన్ని అప్ డేట్స్ సినిమాపై మంచి బజ్ నే క్రియేట్ చేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఈసినిమా టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. కింగ్ ఆఫ్ ద క్రౌడ్ పేరుతో ఈ సాంగ్ ను రిలీజ్ చేయగా.. ఈపాటకు కూడా సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ర‌వితేజ ఎమ్మార్వోగా త‌న డ్యూటీని నిజాయితీగా, సీరియ‌స్‌గా ఎలా చేశాడో చూపించే విధంగా ఈపాట ఉంది. డైరెక్ట‌ర్ శ‌ర‌త్ మండ‌వ స్వ‌యంగా రాసిన ఈ పాట‌ను ల‌వితా లోబో ఆలపించారు.

కాగా ఈసినిమాలో దివ్యాంశ కౌశిక్, ర‌జిష విజయన్ హీరోయిన్లుగా న‌టిస్తుండగా.. వేణు తొట్టెంపూడి, నాజ‌ర్‌, త‌నికెళ్ల‌భ‌ర‌ణి, ప‌విత్ర లోకేష్ ఇత‌ర‌ కీల‌క పాత్ర‌ల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌, ఆర్‌టీ టీం వర్క్స్‌ బ్యానర్లపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈసినిమాకు శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండ‌గా స‌త్య‌న్ సూర్య‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − one =