రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్ , శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్స్ పై ఎడిటర్ శేఖర్ దర్శకత్వంలో నితిన్,బ్లాక్ బస్టర్ “ఉప్పెన”మూవీ ఫేమ్ కృతి శెట్టి జంటగా సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ “మాచర్ల నియోజకవర్గం” మూవీ ఆగస్ట్ 12వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో క్యాథరీన్ మరో కథానాయిక. ప్రభుత్వ ఆఫీసర్ గా నితిన్ నటిస్తున్న ఈ మూవీలో విలన్ గా సముద్ర ఖని నటిస్తున్నారు. మహతి సాగర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “మాచర్ల నియోజకవర్గం” మూవీ పోస్టర్లు, గ్లింప్స్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో నితిన్ ,అంజలి పై తెరకెక్కిన ‘‘రా రా రెడ్డి.. ఐ యామ్ రెడీ’’ అనే స్పెషల్ మాస్ సాంగ్‌ను జూలై 9 వ తేదీన చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నితిన్ , అంజలి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుని 20+ మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి, 300K + లైక్స్ ని సొంతం చేసుకొని గత 11 రోజులుగా యూట్యూబ్ మ్యూజిక్ నెంబర్ 1 గా ట్రెండింగ్‌లో ఉంది. “మాచర్ల నియోజకవర్గం” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: